Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:37AM

చేవెళ్ల మండలాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా


చేవెళ్ల: రాష్ట్ర మంత్రి పి. మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ పి. సునీతారెడ్డితో పాటు మండల ప్రజల సహకారంతో చేవెళ్ల మండలాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిదుతానని చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజా సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ, చేవెళ్ల మండలాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో మన చేవెళ్ల-మన ఆలోచన-మన ప్రగతి అనే కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ప్రజా చైతన్య వేదికలో సమగ్ర చర్చ జరపగా ఎన్నో సమస్యలు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిపారు. చేవెళ్లలో సీసీరోడ్లు, వీధి దీపాలు, తాగునీరు. అంతర్గత మురుగు కాల్వలు, రైతులకోసం శీతల గిడ్డంగులు, గిట్టు బాటు ధర, మార్కెట్‌, చేవెళ్ల బస్‌ స్టేషన్‌ ఆధునీకరణ, బస్‌డిపో నిర్మాణ, చేవెళ్ల వరకు సబర్‌బన్‌ సర్వీసు పొడిగింపు, మండలంలో లింకు రోడ్ల నిర్మాణం, మినీ స్టేడియం ఏర్పాటు, పాలిటెక్నికల్‌ కళాశాల, పీజీ కళాశాల ఏర్పాటు, మంజీరా జలాలు, చేవెళ్లను జిల్లా కేంద్రంగా మార్చాలని తదితర సమస్యలు చర్చావేదిక ద్వారా బయటకు వచ్చినట్లు తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే.. అత్యధిక నిధులు అవసరమని చెప్పారు. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న చేవెళ్ల అన్ని రంగాల్లో వెనకబడిందని తెలిపారు.
చేవెళ్ల అభివృద్ది చెందాలంటే.. కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు. చేవెళ్ల సమస్యలను కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.ందించే8రో్తఆ