Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:29AM

కేసీఆర్‌ తీరు గర్హనీయం



విజయనగరం కలెక్టరేట్‌: హైదరాబాదులోని మహిళా జర్నలిస్టుల ఆందోళనను అమానుషంగా అణిచివేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరును జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నిరసనగా పట్టణంలో బుధవారం ఆందోళన, ర్యాలీ చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే దేశ వ్యాప్తంగా వున్న జర్నలిస్టుల సంఘాలన్నీ ఐక్యమై, ఆందోళనను ఉధృతం చేస్తాయని హెచ్చరించాయి.
మూడు నెలలుగా తెలంగాణలోని ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాలపై ఉక్కు పాదం మోపడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మహిళా జర్నలిస్టులందరూ తెలంగాణా సీఎం తీరుకు నిరసనగా చాలా చోట్ల ఆందోళ నలు చేశారు. ఆ సమయంలో వారిని లాఠీలతో కొడుతూ నియంతృత్వ ధోరణితో పోరాటాన్ని అణిచివేశారు. మహిళలని చూడకుండా అమానుషంగా ప్రవర్తించారు. దీనికి నిరసనగా ఏపీయూడబ్ల్యూజే(ఎఫ్‌), విజయనగరం ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల అసోసియేషన్‌ సంయుక్తంగా కలెక్టరేట్‌ కూడలిలో బుధవారం రాస్తారోకో నిర్వహి ంచాయి. కేసీఆర్‌ వ్యాఖ్యలను ఎండగట్టాయి. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి తెలంగాణ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. కేసీఆర్‌ కుటుంబం చేసిన ఆరాచకాలు, అక్రమాలను వెలుగులోకి తెచ్చిన సంస్థలపై కక్ష గట్టడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. మీడియా సంస్థలు తప్పు చేస్తే సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయడం కాని, న్యాయ స్థానాలను ఆశ్రయించడం కాని చేయాలే తప్ప ప్రసారాలని నిషేధించడం అక ్కడ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి అద్దంపడుతోందన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందికి వినతిపత్రం అందించారు.
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే(ఎఫ్‌) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బూరాడ శ్రీనివాసరావు, యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.మదుసూధనరావు, యూనియన్‌ నాయ కు లు దుర్గాప్రసాద్‌, రామకృష్ణ, డేవిడ్‌ రాజు, చలం, గణేష్‌, ఎం.శ్రీనివాసరావు, పీఏ నాయుడు, ముఖర్జీ, శ్రీనివాసరావు, ముకుంద, శ్రీనివాసరావు, ఈశ్వర్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధులు ఎంఎంఎల్‌ నాయుడు, నాగేంద్రప్రసాద్‌, అమ ర్‌, మల్లిఖార్జునరావు, బాబా, సత్యవిజన్‌, సిటీ కేబుల్‌ ప్రతినిధులు వీజెపీజె నాయకులు, దారా వెంకటరమణ, మూర్తి, జశ్వంత్‌, కె.శ్రీనివాసరావు, సుధీర్‌, చిన్నపత్రికల అసోసియేషన్‌ ప్రతినిధులు రాజాపు బాబురావు, చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహానికి వినతి
మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ-9 ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే, రెండు తెలుగు రాష్ర్టాల్లో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరీ కూడలిలో వున్న మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందిం చింది. కేసీఆర్‌ వైఖరిలో మార్పు రావాలని మహాత్మాగాంధీ విగ్రహం ముందు మౌనం పాటించింది. కార్యక్రమంలో డి.అచ్యుతరావు, రాధా కృష్ణ, శివప్రసాద్‌, శేషగిరి, పాత్రో వైఎస్‌ పంతులు తదితరులు పాల్గొన్నారు.