Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:28AM

కాగ్‌కు సమాధానమివ్వండి



విజయనగరం టౌన్‌: గత ప్రభుత్వ అవి నీతిని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తప్పు పట్టిందని, దానికి సమాధానమివ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ ధ్వజమెత్తారు. సాగునీటి రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు చేసి ఆ నిధులతో నాణ్యత లేకుండా అసంపూర్తిగా పనులు చేపట్టి గత పాలకులు నిధులు కాజేశారని ఆరో పించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో సాగునీటిరంగం కుదేలు అయిందన్నారు. ప్రాజెక్టులు పూర్తికాక, సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. తద్వారా వ్యవసాయ రంగం కూడా పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఇక రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో వుందన్నారు. వచ్చేనెల 2 నాటికి రైతులకు రుణమాఫీ ప్రయోజనం కలగనుందని స్పష్టం చేశారు. జిల్లాలోని సీతానగరం చెక్కెర కర్మాగార డైరెక్టర్ల అరెస్టు విషయంలో కొంతమంది ప్రకటనలు చూసి ఆశ్చ ర్యం వేస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా రైతులకు డబ్బులు అందలేదన్నారు. దాదాపు రూ. 23 కోట్లు బకాయి పడిదంటే.. రైతుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చునన్నారు. అప్పటి మంత్రిగా వున్న బొత్స సత్యనారాయణ కనీసం రైతుల గురించి కాని, వారు చేసే ఆందోళనలు కాని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చే శారు. జిల్లాకు హార్డ్‌వేర్‌ పార్కు, లలిత కళల అకాడమీ, ఫుడ్‌కోర్టుతో పాటు, పారిశ్రామికం గా, వ్యవసాయ పరంగా ముందుకు తీసుకుని వెళ్లేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు.
సాలూరు రూరల్‌: గత ప్రభుత్వ పాపాల ను కాగ్‌ తన నివేదికలో ఎండగట్టిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, మాజీఎమ్మెల్యే ఆర్పీభంజ్‌దేవ్‌ ధ్వజమెత్తారు. ఆయన ఆర్పీ భవన్‌లో టీడీపీ నేతలతో కలిసి బుధవారం విలేఖరులతో మాట్లాడారు. జలయజ్ఞం పేరిట రూ. 71,595 కోట్ల ఖర్చు చేశారే తప్ప రైతు లకు ఆశించిన మేరకు సాగునీరందలేదన్నా రు. గోదావరి, నాగావళి, వంశధారలపై వరద కట్టల నిర్మాణానికి కేంద్రం మంజూరు చేసిన రూ. 844 కోట్లు నిలిచిపోవడానికి గత ప్రభు త్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రూ. 927 కోట్లతో ఖర్చు చేసినా వరద ముంపు నుంచి రక్షణ కల్పించలేదన్నారు. ఎలాంటి అనుమతు ల్లేకుండా 102 హెక్టార్ల అటవీ భూములను మళ్లించారన్నారు. గత ప్రభుత్వం అన్ని రంగా ల్లో రాషా్ట్రన్ని అధోగతి పాల్జేసిందన్నారు. క్లిష్టపరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబుకు సార ఽథ్యం అందించారన్నారు. రాషా్ట్రన్ని గాడిలో పెట్టాలని చూస్తున్న సీఎంకు వైసీపీ అండగా నిలవాల్సి వుండాల్సింది పోయి, ఇబ్బందులను పెట్టడానికి చూస్తున్నదన్నారు. ఈయనతో పాటు బలగ పైడిరాజు, గొర్లె మాధవరావు, ఆముదాల పరమేశు, కాకిరంగ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.