Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:28AM

పద్యపఠన పోటీలకు విశేష స్పందన




దాసన్నపేట:రోటరీ నవతరోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని ప్రైవేట్‌ హోటల్‌లో నిర్వహించిన పద్యపఠన పోటీలకు విద్యార్థుల నుంచి విశేష స్పందించి లభించిం ది. జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విజయనగరం సెంట్రల్‌ క్లబ్‌ అధ్యక్షుడు సునీల్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాషను చందోబద్ధంగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే పద్యపఠన పోటీ లు నిర్వహించిందన్నారు. ప్రతి ఒక్కరూ తెలు గు భాషపై పట్టుకలిగివుండాలని కోరారు. కార్యక్రమ నిర్వహణ చైర్మన్‌ అజయ్‌ మెహతా మాట్లాడుతూ విజేతలకు ఉత్సవాల ముగింపు రోజున బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా అవధాని కట్ట మూర్తి చంద్రశేఖర్‌, ఉత్తమ తెలుగు పండిట్‌ అవార్డు గ్రహీత ఉపద్రష్ట వెంకటవర ప్రసాద్‌, గుదిమెల్ల రంగాచార్యులు వ్యవహరించారు. కార్యక్రమంలో క్లబ్‌ కార్యదర్శి డిఎస్పీ లింగం, సహాయ గవర్నర్‌ టి.ఎల్‌.ఎన్‌.మూర్తిలతో పాటు రోటరీ క్లబ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న రోటరీ యూత్‌ ఫెస్ట్‌
దాసన్నపేట:రోటరీ యూత్‌ ఫెస్ట్‌ 2014 కార్యక్రమంలో భాగంగా బుధవారంలో నిర్వ హించిన కళాశాల విద్యార్థుల నృత్య పోటీ లు అలరించాయి. పట్టణంలోని వివిధ కళా శాలల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం రోటరీ ప్రధాన క్లబ్‌ అధ్యక్షుడు వి.ఎస్‌.కిరణ్‌ బాబు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. విజయనగరం కళలకు పుట్టినిల్లని అన్నారు. శ్రీచైతన్య, గాయత్రీ హోటల్‌ మేనేజ్‌మెంటు అకాడమీ, సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్‌బాబు, ప్రవీణ్‌ కుమార్‌, ప్రతినిధులు పి.వి.నరసింహరాజు, సుబ్బరాజు, నానాజీ, ఎస్‌.వి.రమణయ్య పాల్గొన్నారు.