desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:28AM

ఆధార్‌ అవస్థలుగంట్యాడ:అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధా ర్‌ కీలకం కావడంతో ఇప్పుడు మీసేవా కేంద్రా ల వద్ద ప్రజలు నమోదు కోసం బారులు తీరుతున్నారు. దీంతో ఈసేవా కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. కొటారుబిల్లి కూడలి వద్ద మీసేవ కేంద్రం వద్ద ఆధార్‌ కార్డులు తీస్తున్నారు. మండలంలో రోజుకు రెండేసి గ్రామాలకు ఆధార్‌ నమోదు చేస్తున్నారు. ఆయా గ్రా మాల నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంట లకే దాదాపు 100 నుంచి 200 మంది కేం ద్రాలు వద్దకు వస్తున్నారు. బాలింతలు, గర్భిణులు, వృద్ధులైతే మరిన్ని కష్టాలు పడుతున్నా రు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడే గడుపుతున్నారు. అయితే కేంద్రంలో రోజుకు 50 మంది వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. దీంతో మిగిలిన వారు రాత్రి 8 గంటలు వరకూ పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటివరకూ మండలంలోని రేషన్‌ కార్డుల సీడింగ్‌ ప్రకారం 70,779 యూనిట్లకు ఇప్పటి వరకూ 52,303 మంది మాత్రమే అనుసంధానం చేయగా, మిగిలిన వారి ఆధార్‌ వివరాలు సేకరించవల్సి వుంది. గతంలో మండలంలోని సుమారు 86 శాతం ఆధార్‌ నమోదు జరిగింది. కాని వీరిలో చాలా మందికి కార్డులు రద్దు రద్దు అయ్యాయి. దీంతో వారు తిరిగి మరోసారి వివరాలు నమోదు చేసుకోవడానికి కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.