Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:28AM

ఆర్థిక బాధలతో స్వర్ణకారుడి ఆత్మహత్య


మెదక్‌ అర్బన్‌: తీవ్రమైన ఆర్థిక బాధలను భరించలేక ఓ స్వర్ణకార యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని తనువు చాలించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్‌ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో అద్దె గృహంలో నివాసముంటున్న చిన్నశంకరంపేట వాసి సంతోష్‌కుమార్‌చారి (28) సరిత దంపతులకు ఇద్దరు చిన్నారులున్నారు. గత నాలుగైదేళ్లుగా మెదక్‌లో స్వర్ణకార వృత్తి ద్వారా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో స్వర్ణకార వృత్తి ద్వారా జీవనాధారం కొరవడుతుందని గత కొన్నాళ్లుగా పలువురితో ఆవేదన వ్యక్తం చేసేవాడు. దీంతో కొంత అప్పు చేయా ల్సి వచ్చింది. తద్వారా మనశ్శాంతి కొరవడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న సంతోష్‌కుమార్‌చారి మృతి చెందడంతో కుటుంబం పూర్తిగా అనాథగా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్వర్ణకార సంఘం నేతలు ఉపేంద్రచారి, శ్రీనివాసచారి, సత్యనారాయణ, విఠల్‌, స్థానిక కౌన్సిలర్‌ గూడూరి అనూషఅరవింద్‌గౌడ్‌ మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు.