desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:27AM

అప్పుచేసి పప్పుకూడు
(సాలూరు రూరల్‌)
అప్పుచేసి పప్పుకూడు అంటే ఇదేనేమో. రాష్ట్రంలో ఐదు జిల్లాల్లోని తొమ్మిది గిరిజన గురుకుల పా ఠశాలలకు 17 నెలలుగా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి డైట్‌ చార్జ్జీలు విడుదల కాలేదు. దీంతో ఆ యా పాఠశాలల్లో భోజన నిర్వహణ ప్రిన్సి పాల్స్‌కు కత్తిమీద సాములా తయారైంది. విద్యా ర్థులకు సమయానికి మెనూ ప్రకారం భోజన ఏర్పాట్లు చేయడానికి అ ప్పులు చేసి తిప్పలు పడుతున్నారు. తమకు స మీపంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాల లు, జూనియర్‌ కళాశాల నుంచి అప్పులు తె స్తుంటే ఆడిటర్లు తప్పుపడుతున్నారు. దీంతో అదే శాఖకు సంబంధించిన విద్యాసంస్థల నుం చి సైతం అప్పు పుట్టడం కష్టంగా మారనుంది.
సీమాంధ్రలో 42 గిరిజన గురుకుల పా ఠశాలలున్నాయి. వీటిలో 33 గురుకుల పాఠశా లలకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి నేరుగా డైట్‌, కాస్మోటిక్‌ తదితర నిధులు విడుదలవు తాయి. శ్రీకాకుళం జిల్లా పెదమడి, విజయనగ రం జిల్లాలో పి.కోనవలస, విశాఖ జిల్లాలో అ ప్పర్‌ సీలేరు, పెదబయలు, పాడేరు, కొయ్యూ రు, తూర్పుగోదావరి జిల్లాలో అడ్డతీగల, రా జవొమ్మంగి, పశ్చిమగోదావరి జిల్లాలో బుట్టా యగూడెంల్లో ఉన్న గిరిజన గురుకుల పాఠశా లలకు స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి డైట్‌, కాస్మోటిక్స్‌ తదితరాల నిర్వహణకు నిధులు మంజూరవుతాయి. అయితే స్కూల్‌ ఆఫ్‌ ఎ డ్యుకేషన్‌ నుంచి 17 నెలలుగా డైట్‌ చార్జీలు, 11 నెలల నుంచి కాస్మోటిక్‌ చార్జ్జీలు విడుదల కాకపోవడంతో ఈ పాఠశాలలు నిర్వహణకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. అయితే ప్రిన్సిపా ళ్లు ఆయా గురుకుల పాఠశాలల్లో భోజన ఏర్పాట్లుకు అప్పులతో కాలం నెట్టుకొస్తున్నారు. కొన్ని నిత్యావసర సరుకులు జీసీసీ, డీసీఎం ఎస్‌ల నుంచి రావడంతో కొంత ఊరటగా ఉం ది. అయితే గ్యాస్‌, పాలు వంటి వాటికి ఆయా సంస్థలు అరువును భరించకపోవడంతో ఇబ్బం దులు తప్పట్లేదు. గుడ్లు, కూరగాయలు సర ఫరా చేసే వారు తమకు ఎంతో కొంతైనా చె ల్లింపులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో తమ శాఖకు చెందిన ఇతర విద్యా సం స్థల నుంచి కొంతమొత్తంను అప్పు తెచ్చి ఆ యా సంస్థలు, టెండర్‌దారులకు కొంతలో కొం తమొత్తం చెల్లిస్తున్నారు. అయితే స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నిధులతో నడుస్తున్న ఈ విద్యాసం స్థలకు అప్పులివ్వడం సరి కాదని గిరిజన సం క్షేమ శాఖ నుంచి వచ్చే ఆడిటర్లు తప్పుపడు తున్నారని సమాచారం. దీంతో ఆయా విద్యా సంస్థల నిర్వహణకు కష్టకాల మొచ్చే పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి మన జిల్లాలో సాలూరు మండలం పి.కోనవలస గిరిజన గురుకుల పాఠశాల కూడా ఎదుర్కొంటోంది. ఈ పాఠశాలలో 478 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లకు నెలకు రూ.3.8లక్షలు భోజనాల రూపేణా ఖర్చవుతుంది. ఈ లెక్కన 17 నెలలకు గాను ఈ పాఠశాలకు రూ.64లక్షల 60 వేలు రావాల్సి ఉంది. కాస్మోటిక్స్‌ చార్జీలు 11 నెలలకు కలిపి రూ.2లక్షల 53 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ గురు కులానికి నేరుగా గిరిజన సంక్షేమ శాఖ నుంచి నిధులు వచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని పలువురు కోరుతున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు కుట్టించిన దుస్తులకు సంబంధించి చార్జీలు సైతం రెండేళ్లుగా విడు దల కాలేదు. ఈ బకాయిలను విడుదల చే యాలని ఆయా సంస్థలు కోరుతు న్నాయి.
అసెంబ్లీలో ప్రస్తావించా: ఎమ్మెల్యే రాజన్న
రాష్ట్రంలో తొమ్మిది గిరిజన గురుకుల పాఠ శాలలకు స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి డైట్‌, కాస్మోటిక్‌ చార్జీలు విడుదల కాని విషయం అ సెంబ్లీలో ప్రస్తావించినట్టు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలిపారు. గిరిజన విద్యార్థు లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సత్వరం నిధులు విడుదలయ్యేం దుకు కృషి చేస్తానని చెప్పారు.