Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:07AM

‘ఆర్టీసీ జోన్‌ రూ. 15 కోట్ల నష్టాల్లో ఉంది’




హుజూరాబాద్‌ టౌన్‌: కరీంనగర్‌ జోన్‌ గత ఏప్రిల్‌ నుంచి జూలై వరకు రూ. 15 కోట్ల నష్టాల్లో ఉందని జిల్లా ఆర్టీసీ జోన్‌ ఈడీ పురుషోత్తం నాయక్‌ వెల్లడించారు. బుధవారం ఆయన పట్టణంలోని ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల్లో పనితనం మెరుగైందని, ఖర్చు తగ్గిస్తే లాభాల బాట పడుతామన్నారు. కష్టాలకు ప్రధాన కార ణం డీజిల్‌ ధరలు పెరగడమేనన్నారు. ఈ నాలుగు మాసాల్లో పెరిగిన డీజిల్‌ ధర సుమా రు రూ. 27 కోట్లు అన్నారు. డీజిల్‌ ధర పెరగకుంటే రూ.12 కోట్లమేర లాభాల్లో సంస్థ ఉండే దన్నారు. ఆక్యుపెన్సీ రేట్‌ 2 శాతం పెరిగి ఆదాయం కూడా రూ. 66 కోట్ల 80లక్షలకు పెరిగిందన్నారు. హుజూరాబాద్‌ డిపో ప్రారంభించినప్పటి నుంచి నష్టాల భాటలోనే ఉందన్నారు. రానున్న మార్చి 15 వరకు నష్టాన్ని జీరోకు చేసి నో లాస్‌ నో ప్రాపిట్‌ స్థితికి తీసుకువస్తామన్నారు. బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, గ్రానైట్‌ తో నిర్మాణం చేపట్టిన ప్లాట్‌ఫాం మధ్యలో తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిపోలోని కార్మికుల కష్ట, నష్టాల గురించి తెలుసుకున్నామని రెస్ట్‌ రూం బాగు చేయిస్తామన్నారు. హుజూరాబాద్‌, జమ్మికుంట, పర్కాల్‌కు కొత్తరూట్‌ రోజుకు 5 బస్సులు 1 నుంచి 3 ట్రిప్పులు వేస్తాయన్నారు. డిపో యా ర్డును లెవలింగ్‌ చేయిస్తామన్నారు. బస్టాండ్‌ ఇన్‌గేట్‌ ఏరియా సరిగ్గా లేదని ఈ ప్రాంతంలో సైకిల్‌ స్టాండ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. బస్టాండ్‌ ఆవరణలోని 11 గదుల పైన గదుల నిర్మాణాలకు రీ టెండర్‌ పిలుస్తామన్నారు. అంతకుముందు ఆయన బస్టాండ్‌, డిపోలను పరిశీలించారు. డిపోకు ఆగస్టు నెలలో ఎక్కువ ఆదాయాన్ని అందించిన కండక్టర్లు ఉపేందర్‌, రాజేశ్వరి, కుమార్‌లకు నగదు బహుమతి అందజేశారు. సమావేశంలో ఆర్‌ఎం మునిశేఖర్‌, డీఎం రమేష్‌, డిప్యూటి సీటీఎం మధుసూదన్‌, సీఎంఈ కృష్ణమూర్తి, ఈడీపీఏ నరేందర్‌, ఈడీసీఐ పరమేశ్వరి, డిపో నాయకులు స్వామి, పీస్‌ సింగ్‌, మల్లయ్య, కె అశోక్‌బాబు, ఎస్‌ కృష్ణ, కె పాణీ, సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.