Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:06AM

ఆర్థిక అసమానతల మధ్య పునర్నిర్మాణం ఒక ఎండ మావి
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)
ఆంధ్రజ్యోతి: తెలంగాణ పునర్నిర్మాణానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటీ?
శ్రీనివాస్‌: తెలంగాణ పునర్నిర్మాణం అంటే భౌతిక పునర్నిర్మాణం, ఆర్థిక పునర్నిర్మాణం, సామాజిక పునర్నిర్మాణం. కొత్త జిల్లాలు, మం డలాలు, పంచాయతీల ఏర్పాటు, ఇతర పాలన సౌలభ్యాల కల్పన. భౌతిక పునర్ని ర్మాణంలోకి వస్తే ఆర్థిక అసమానతలు తొలగించడం, ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడం తద్వారా అభివృద్ధి సాధించడం ఆర్థిక పునర్ని ర్మాణమవుతుంది. ప్రజలందరికీ సామా జిక న్యాయం కల్పించడంతో పాటు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడమే సామాజిక పునర్ని ర్మాణం. ఈ మూడు పనులు జరిగితేనే తెలంగాణ పునర్నిర్మాణమైనట్లు.
ఆంధ్రజ్యోతి: బంగారు తెలంగాణ అంటే ఎలా ఉండాలి?
శ్రీనివాస్‌: మనిషిని మనిషి దొచుకునే పరి స్థితులు లేని సమాజం బంగారు తెలంగాణకు పునాది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యం గా రెవెన్యూ, పోలీస్‌, మున్సిపల్‌ సేవలకు ప్రత్యేక రేట్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు పని చేయాలంటే ఆయా ప్రాంత ప్రజాప్రతినిధులు రేట్లు ఫిక్స్‌ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్య త కరువై బంగారు తెలంగాణ కాస్త బొగ్గు తెలంగాణగా మసిబారి పోయింది.
ఆంధ్రజ్యోతి: తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ స్థాపన దిశగా ప్రస్తుతం ప్రభుత్వ కృషి ఎలా ఉంది?
శ్రీనివాస్‌: భౌతిక పునర్నిర్మాణం మీద ప్రభు త్వం ఇప్పటికే కొంత కార్యాచరణ అమలు చేస్తున్నది. ఆర్థిక, సామాజిక పునర్నిర్మాణాల పైన ప్రభుత్వం వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నట్లు వారి మాటల వల్ల వ్యక్తమవుతున్నది. అయితే ఇప్పటి వరకు ఆచరణ కనిపించడం లేదు. ప్రభుత్వం ఇందుకోసం స్పష్టమైన కార్యాచరణను కూడా ప్రకటించ లేదు.
ఆంధ్రజ్యోతి: తెలంగాణ ప్రభుత్వ 100 రోజుల పాలన ఎలా ఉంది ?
శ్రీనివాస్‌:: కేవలం వంద రోజుల్లో మార్పు సాధ్యం కాదు. కానీ పాలకుల మైండ్‌ సెట్‌ ఎలాంటిదో పరిశీలించే అవకాశం ఉంది. కేసీ ఆర్‌ ప్రయత్నాలు కొన్ని హర్షించదగ్గవి. మరి కొన్ని గర్హించదగ్గవి. వంద రోజుల్లో రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. మద్యం, విత్తనాలు, ఎరువులు తదితర వస్తువుల కల్తీ ఆగలేదు. ఆపే ప్రయత్నం జరుగ లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలపై సీబీసీఐడీ విచా రణ చేపట్టడం మంచి చర్య. జిల్లాకు నాలుగు గ్రామాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయి స్తే 235 కోట్ల అవినీతి బయట పడింది. అన్ని గ్రామాల్లో పరిశీలిస్తే 50 వేల కోట్లు తిన్న తిమింగలాల్ని పట్టవచ్చు. ఆరోపణలు ఉన్న అన్ని శాఖల్లో ఇలాంటి ప్రయత్నం చేస్తే ప్రజ లు హర్షిస్తారు. హైదరాబాద్‌ను సింగాపూర్‌గా మారుస్తానని, కరీంనర్‌ను న్యూయార్క్‌గా చేస్తానని సీఎం అన్నారు సంతోషం. కానీ న్యూయార్క్‌లో, సింగపూర్‌లో చట్టబద్ధ పాలన ఉంది. అదిక్కడ కరువైంది. అమెరికాలో నా మనుమడి బర్త్‌ సర్టిఫికెట్‌కు మున్సిపల్‌ కార్యాలయానికి వెళితే 5 నిమిషాల్లో చేతి కం దింది (సుప్రీంకోర్టు జడ్జీ జగన్నాథరావు సాక్షిగా). అదే కరీంనగర్‌ మాజీ ఎమ్మెల్యే తల్లి డెత్‌ సర్టిఫికెట్‌కు వారు వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాల్సి వచ్చింది, అందుకే బంగారు తెలంగాణకు ముందు ఉద్యోగులు, ప్రజాప్రతి నిధులు తాము ప్రజలకు సేవకులమని, ప్రభువులం కామని గుర్తుపెట్టుకొని పని చేయాలి. తహసీల్దార్లకు కార్లు కొనడానికి వడ్డీలేని రుణాలు అందించడం అవసరమా ? వారేమైనా పేదలా..?
ఆంధ్రజ్యోతి: ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలుంటే బాగుంటుంది ?
శ్రీనివాస్‌: నిర్ణీత సమయంలో ప్రజలకు సేవ లు అందే సిటిజన్స్‌ చార్టర్‌లను అమలు చేసే చట్టం రావాలి. సేవలు సకాలంలో అందించని వారికి శిక్షలుండాలి. పోలీస్‌, రెవెన్యూ సంస్క రణలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ న్యాయ బిల్లును అమలు పర్చాలి. కర్ణాటక తరహ లోకాయుక్త చట్టం రాష్ట్రంలో రావాలి. ప్రతి జిల్లాలో అంబుడ్స్‌మెన్‌ వ్యవస్థను నెలకొల్పి అవినీతి భరతం పట్టాలి.
ఆంధ్రజ్యోతి: ఏబీఎన్‌, టీవీ9లపై నిషేధంపై మీ అభిప్రాయం ?
శ్రీనివాస్‌: ఎంపిక చేసుకునే హక్కు (రైట్‌ ఆప్‌ చూస్‌) అనేది వినియోగదారులకున్న ప్రాథమిక హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. ఏ బ్రాండ్‌ వస్తువు వాడలో, ఏ ఛానల్‌ చూడా లో, ఏ పత్రిక చదవాలో నిర్బంధంగా రుద్దే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి లేదు. ఏబీఎన్‌, టీవీ9ల ప్రసారాలను ఎం ఎస్‌వోలు నిలిపివేయడం రాజ్యాంగ వ్యతిరేకం. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ విషయంపై మౌనంగా ఉండడం, తనకు సంబంధం లేదనడం చట్ట వ్యతిరేకం. రాష్ట్రంలో ఎంఎస్‌వోల అరాచకాలు ఏ నిబంధన ప్రకారం చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. వరంగల్‌లో సీఎం వ్యాఖ్యలు దురదృష్టకరం. రాజ్యాంగ ప్రతినిధిగా కేసీఆర్‌ అలా ఆవేశంలో మాట్లాడాల్సింది కాదు. జర్న లిస్టులు శాంతియుత నిరసన తెలపడం తప్పు కాదు. ఇది ఎమర్జెన్సీ రోజుల్ని తలపిస్తున్నది. తప్పు చేసిన టీవీ9ను శిక్షించే అధికారం అసెం బ్లీకుంది. తప్పుచేయని ఏబీఎన్‌ను ఎందుకు ఆపేశారు. ప్రజాస్వామ్యానికి కేసీఆర్‌ ఇచ్చే నిర్వచనం ఇదేనా? ఏ దేశానికైనా వ్యవస్థ ముఖ్యం కాని వ్యక్తులు కాదు. ఎంఎస్‌వోలపై ప్రజలు ఎదురుతిరగాలి. మౌనంగా ఉండడం చీకటి రోజులను ఆస్వాదించడమే.
ఆంధ్రజ్యోతి: భవిష్యత్‌లో లోక్‌సత్తా ఉద్య మసంస్థ, వినియోగదారుల మండలి పాత్ర ఎలా ఉంటుంది?
శ్రీనివాస్‌: తెలంగాణ పునర్నిర్మాణం విష యంలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడంతో పాటు బాధ్యత గల పౌరులుగా ప్రభుత్వానికి సహకరిస్తాం. అలాగే ప్రభుత్వం తీసుకునే చర్యల్లో పొరపాట్లు ఉంటే ఎత్తి చూపుతాం. వినియోగదారులకు జరిగే మోసాల్ని ఎండగడుతూ, వారికి న్యాయం చేసే రీతిలో వినియోగదారుల చట్టం 1986 ప్రకారం గత 27 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం. దాదాపు 9000 కేసుల్లో 20 కోట్ల నష్టపరిహారం ఇప్పించాం. మోసాలున్నంత వరకు మా ప్రయత్నం ఉంటుంది. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ గత 14 సంవత్సరాలుగా అవినీతికి వ్యతి రేకంగా కృషి చేస్తున్నది. అవినీతికి పాల్పడ్డ ఐఎఎస్‌లు అయినా ప్రజాప్రతినిధులైనా వదల్లేదు. అలాగే పాలనలో చట్టబద్ధత కోసం, సమాచార హక్కు అమలు కోసం, ప్రజల్లో నిరంతర జాగరూకత కోసం కృషి చేస్తాం. అవి నీతికి పాల్పడిన వారు ఆంధ్రావాడైనా, అమె రికా వాడైనా తెలంగాణ వాడైనా వదలం. 67 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం ఇంకా మహి ళలు బహిర్భూమికి బహిరంగ ప్రాంతాలను వాడుతున్నారంటే పాలకుల ‘చెత్త’శుద్ధి తెలు స్తున్నది. బ్రతకడానికి కనీస అవసరాలు కల్పిం చని రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. ఓటుకు నోటు తీసుకునే మనస్తత్వం పోవాలి. నోటు తీసుకున్నంత కాలం ప్రజలకు ప్రతిని ధులు వెన్నుపోటు పొడుస్తూనే ఉంటారు. ఈ పరిస్థితులు మారాలి. ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తాం.
ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. పాలకుల వ్యక్తిగత ఆస్తులు కావు. 50 లక్షలకు పైగా ఖర్చు చేయాలంటే టెండర్లు పిలవాలన్న నిబంధన ఉంది. దాన్ని కాదని 200 కోట్లతో 1500 ఇన్నోవా కార్లు కొని పోలీస్‌ శాఖకు ఇప్పించే అధికారం(టెండర్లు లేకుండా) ప్రభుత్వానికి ఏ నిబంధన కింద సంక్రమిం చిందో పాలకులే వివరణ ఇవ్వాలి.