Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:06AM

చాకలి ఐలమ్మను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం



సుభాష్‌నగర్‌: తెలంగాణ సాయుధ పో రాట వీరవనిత చాకలి ఐలమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని చాకలి ఐల మ్మ వర్ధంతి సభలో వక్తలు అభిప్రాయపడ్డా రు. నగరంలోని ప్రెస్‌భవన్‌లో బుధవారం నవ తెలంగాణ యువజన సంక్షేమ సంఘం ఆ ధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ సూరెపల్లి సుజాత మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక భూమిక వహించి తన కుటుంబాన్ని సర్వస్వం పొగొట్టుకున్న చాలకి ఐలమ్మ ను ప్రభుత్వం విస్మరించిందని, ప్రతి ఏటా ప్ర భుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. జిల్లా రజక సంఘాల వ్యవస్థాపకు డు కొట్లారి మల్లేశ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ వీర పోరాటం, నేటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ప్రేరణ నిచ్చిందన్నా రు. తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జ ర్నలిస్టు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బిజిగిరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ చా కలి ఐలమ్మ వారసత్వాన్ని కొ నసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమం నవ తెలంగాణ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిజిగిరి నవీ న్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. దళిత బహుజన మహ సభ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల భూషణ్‌రావు, టఫ్‌ జిల్లా అ ధ్యక్షుడు బొల్లం లింగమూర్తి, రజక సంఘం జిల్లా అధ్యక్షు డు గంగిపెల్లి వెంకటేశ్వర్లు, కుల సంఘాల జే ఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జిఎస్‌ ఆనంద్‌, దుడ్డెల ప్రశాంత్‌, దళిత లిబరేషన్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు.