Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:06AM

కేసీఆర్‌ మోసకారి..



సిరిసిల్ల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసకారి మాటలకు చేతలకు పొంతన లేకుం డా వ్యవహరిస్తున్నాడని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం సిరిసిల్లలో అంబేద్కర్‌ యువజన సంఘం డివిజన్‌ అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌ను తండ్రి మృతి చెందగా పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఎం తోకాలం కేసీఆర్‌ మోసాలు కొనసాగవని, టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చే స్తారని, ప్రజాతిరుగుబాటు ఉద్యమానికి ప్రతిపక్షాలు నాయకత్వం వహించకపోయినా తా ము మాత్రం నాయకత్వం వహిస్తామని అన్నా రు. కేసీఆర్‌ దళిత ముఖ్యమంత్రి విషయం నుంచే మోసాలు చేస్తున్నాడని, డిప్యూటీ సీఎం ను అవమానపరిచాడని అన్నారు. నక్సలైట్ల ఎజెండాను అమలు చేస్తానన్న కేసీఆర్‌ నక్సలైట్లు ఆక్రమించుకొని పేదలకు పంచిన భూ ములను కొనుగోలు చేయడం కాదన్నారు. కేసీ ఆర్‌ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ గ త ప్రధానికి లేఖ రాసాడని, ఇప్పటి ప్రధానితో చర్చించినప్పుడు వర్గీకరణ విషయం ప్రస్తావించలేదన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ జి ల్లా అధ్యక్షుడు ఆవునూరి ప్రభాకర్‌, అంబేద్కర్‌ యువజన సంఘం డి విజన్‌ అధ్యక్షుడు కత్తెర దేవదాస్‌, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అధ్యక్షుడు కం సాల మల్లేశం, కత్తెర చొక్కారాం, చిట్యాల మ ధు, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.