Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:03AM

పట్టు బిగిస్తున్న పార్టీలు


జగదేవ్‌పూర్‌: మెదక్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు పట్టు బిగిస్తున్నాయి. ఎన్నిక సమయం దగ్గర పడుతుండడంతో ఆ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గత సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ, మండలస్థాయి నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీఆర్‌ఎస్‌ ఏకపక్షమైనట్లుగా భావించిన నేపథ్యంలో అన్ని పార్టీలు గట్టి పోటీనిస్తుండటం విశేషం. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోటీ బలంగా ఉండనున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ కూడా పాట్లు పడుతోంది. గత ఎన్నికల్లో కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి గెలుపొంది ముఖ్యమంత్రి కావడంతో సొంత మండలమైన జగదేవ్‌పూర్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి భారీగా వలసలు జరిగాయి. ముఖ్య నా యకులంతా టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్‌, టీడీపీలు దాదాపు ఖాళీ అయ్యాయని భావించారు. దీంతో ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వస్తుందని చాలామంది భావిస్తున్నారు. కాగా, వారం రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో భారీ మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు ఓట్లు రాబట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ మెజార్టీని తగ్గించాలన్న లక్ష్యంతో ఆ పార్టీల నాయకులు పనిచేస్తున్నారు. నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు పోలేదని, కిందిస్థాయిలో పార్టీ బలంగానే ఉందని భావించి వారిలో నూతనోత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి ప్రచార బాధ్యతలను స్వీకరించగా, బీజేపీ-టీడీపీల నుంచి వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీలు జగదేవ్‌పూర్‌లో నిర్వహించిన రోడ్‌షోలు విజయవంతమవడంతో పార్టీల బలాన్ని నిరూపించినట్టయింది. రెండు పార్టీలకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో నేతలు సంతోషంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా రోడ్‌షోలో రాష్ట్ర నేతలు రేవంత్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు ప్రసంగించడం కూడా పార్టీల బలోపేతానికి కారణమయిందనే భావిస్తున్నారు. రైతు రుణమాఫీ, ఇటీవలి నిర్వహించిన సమగ్ర సర్వేలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ గీతారెడ్డితోపాటు యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వంశీచందర్‌రెడ్డి ప్రచారం చేస్తుండగా, బీజేపీ-టీడీపీ నేతలతో పాటు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రోజూ ప్రతి గ్రామంలో 30 మందిని ఎంపికచేసి ఆ గ్రామంలోనే ఉదయం, సాయంత్రం ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ ఓట్లు సాధించడానికి ఆ పార్టీల నేతలు తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాగా అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో ముందంజలో ఉందని చెప్పవచ్చు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మండలానికి ఇన్‌చార్జిగా ఉండి ప్రచార బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు, ఎంపీ కడియం శ్రీహరిలు కూడా పాల్గొన్నారు. ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా టీఆర్‌ఎస్‌లోనే ఉండడంతో భారీ మెజార్టీ వస్తుందని అందరు భావిస్తున్నారు. కేసీఆర్‌ సొంత మండలమైనందున పార్లమెంట్‌ పరిధిలోనే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య పోటాపోటీ కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఠీ4ఔఇఠ4ఔఎఔ4ఔఇ34ఔఇౌ4ఔఇడ4ఔఎూఒజీక4క్జఅ0ౖడఈజటఐఛజటఓఠిజటఔఈజట్గ0ఝఐ్డజడకఈఖ7ఐౖఇఠీజ్ఛూఇఠీఠిు2ఆ్ఖ