Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:48AM

రాష్ట్రమంతటికీ ప్రత్యేక హోదా


కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటికీ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కేంద్రానికి ఏపీ సర్కార్‌ లేఖ రాసింది. రాష్ట్రంలో ఏయే పారిశ్రామికవాడలకు ప్రత్యేక హోదా కల్పించాలో తెలియజేయాలని కోరుతూ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఒక లేఖ వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కొన్ని పారిశ్రామిక వాడలకు ప్రత్యేక హోదా కల్పించామని, తద్వారా కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇచ్చామని కేంద్రం పేర్కొంది. దీనిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ సమాధానం ఇస్తూ.. హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాలు కొండ ప్రాంతాల్లో ఉన్నాయని, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా నదీ జలాలు కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల ఆ రాష్ట్రాల్లో కొన్ని పారిశ్రామికవాడలకు ప్రత్యేక హోదా కల్పించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వాతావరణం లేదని, పైగా పారిశ్రామికవాడల్లో భూసేకరణ పెద్ద సమస్యగా మారిందని వివరించారు. రాష్ట్రమంతటికీ ప్రత్యేకహోదా కల్పిస్తే పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని వివరించారు.