Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

సర్వేలకు అంగన్‌వాడీలను మినహాయించండి




చిత్తూరురూరల్‌: ప్రభుత్వం నిర్వహించే వివిధ సర్వేలకు అంగన్‌వాడీ వర్కర్లను మినహాయించాలని ఏపీ అంగన్‌ వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు డీఆర్‌ మధురవాణి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ కోరారు. బుధవారం సంఘ నాయకులతో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఏజేసీ వెంకటసుబ్బారెడ్డికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీవర్కర్లు, ఆయాలు చేయాల్సిన పనుల వివరాలు ఉన్నాయని, వాటిని కాదని ప్రభుత్వం వివిధ పనులను అప్పగిస్తోందన్నారు. జన్‌-ధన్‌ యోజన, బీఎల్‌వోల పనులను చేయించుకొని అదనపు వేతనాలను మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఓట్ల నమోదు కార్యక్రమంలో నిక్కచ్చిగా వ్యవహరించిన వారిని తొలగిస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీవర్కర్లను బీఎల్‌వోలు, ఎన్నికల నిర్వహణ, కుటుంబ సర్వే తదితర వాటి నుంచి మినహాయించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.