Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే



పూతలపట్టు: రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ హామీ ఇచ్చారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ వీణా అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాగునీటి సమస్యపరిష్కారానికి నియోజకవర్గానికి గాను రూ.1.20 కోట్లు మంజూరైందని, ఈ నిధులతో నియోజకవర్గంలోని పల్లెలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు వనజ, ఎంపీడీవో పార్వతమ్మ, తహసీల్దార్‌ రమేష్‌, వైస్‌ ఎంపీపీ ఉమ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పొంతన లేని ప్రశ్నలతో...
పొంతనలేని ప్రశ్నలతో వైసీపీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు మండల సర్వసభ్య సమావేశాన్ని రసాభాస చేవారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ వీణ ఆధ్వర్యంలో మండల సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభమవగానే ప్రతి శాఖ అధికారులు మాట్లాడేందుకు ఎంపీపీ అవకాశం ఇచ్చారు. ఒక్కొక్క అధికారి మాట్లాడుతుండగా వైసీపీకి చెందిన బైటపల్లె ఎంపీటీసీ సభ్యుడు సిద్ధారెడ్డి పొంతనలేని ప్రశ్నలతో సమయాన్ని వృథా చేస్తుండగా.. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు సహనం కోల్పోయి.. సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని సూచించారు. కొంతమంది వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచులు సిద్ధారెడ్డికి మద్దతు తెలిపారు. దీంతో రెండు నిమిషాలపాటు సమావేశంలో స్వల్ప వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. అలాగే రోడ్లు భవనాలశాఖ అధికారి మాట్లాడుతుండగా సిద్ధారెడ్డి జోక్యం చేసుకొని పూతలపట్టులో ఫ్లైఓవర్‌ నిర్మించాలని కోరారు. దీంతో ఆ అధికారి రైల్వేగేట్ల వద్ద్దే ఫ్లైఓవర్‌ నిర్మించాలని ఎక్కడ పడితే అక్కడ కట్టరాదని చెబుతుండగా సిద్ధారెడ్డి మళ్ళీ ప్రశ్నించడంతో సర్పంచుల సంఘం అధ్యక్షులు కార్తికేయచౌదరి కలుగ జేసుకున్నారు. సమస్యలను అధికారులదృష్టికి తేకుండా అనవసర ప్రశ్నలతో అధికారులను ఇబ్బందులు పెట్టిస్తావా.. కూర్చో.. లేకుంటే సభనుండి వెళ్ళిపో అని గట్టిగా మందలించడంతో చేసేదేమీలేక సిద్దారెడ్డి మౌనంగా కూర్చున్నారు.