Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:47AM

నేత్రపర్వం వరసిద్ధుడికి చందనాలంకారం



ఐరాల (కాణిపాకం): బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఉభయదారులు బుధవారం మూలవిరాట్‌కు చందనాలంకారాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి వారిని పూర్తిగా శుద్ధమైన చందనంతో కప్పి స్వర్ణ హస్తాలు, కర్ణాలు, తొండం, వెండి విబూది పట్టీతో అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనం భాగ్యం కల్పించారు. బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలునిర్వహించడానికి విచ్చేసిన కళాకారులను ఆలయ ఏసీ వెంకటేష్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన కళాకారులను శాలువా కప్పి, స్వామి వారి జ్ఞాపికను, ప్రసంశ పత్రాన్ని అందజేశారు.
నేటి సాంస్కృతిక కార్యక్రమాలు... వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 10గంటలకు మునస్వామి ధార్మికోపన్యాసం, మధ్యాహ్నం 12గంటలకు రెడ్డికుమారి భాగవతారిణి హరికథ, మధ్యాహ్నం 2గంటలకు పద్మావతి భక్తి పాటలు, సాయంత్రం 4 గంటలకు లక్ష్మీశ్రీహర్షిత భరతనాట్యం, సాయంత్రం 6 గంటలకు మంజూషా భరతనాట్యం, భక్తి గీతాలు, రాత్రి 8 గంటలక శ్రీకృష్ణా డ్యాన్స్‌ అకాడమీ జానపద గేయాలు, మిమిక్రి, మ్యాజిక్‌ షో, రాత్రి 9 గంటలకు బాబురావ్‌ బృదం పౌరాణిక నాటకం, రాత్రి 12 గంటలకు శ్రీలక్ష్మీ చెన్నకేశవ నాట్యమండలి వారి పౌరాణిక నాటకం నిర్వహించనున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు... ఉద యం 10 గంటలకు ధార్మికోపన్యాసం, మధ్యా హ్నం హరికథ, భక్తి పాటలు, సాయంత్రం కూచిపూడి నృత్యం, భరతనాట్యం, భక్తి గీతాలు, రాత్రి జానపద గేయాలు, మిమిక్రి, మ్యాజిక్‌ షో, పౌరాణిక నాటకం నిర్వహించారు.
నేడు సూర్యప్రభ వాహన సేవ.... ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ జరగనుంది. ఈ సేవకు బొమ్మసము ద్రానికి చెందిన దివంగత రాజమ్మ, రాజశేఖరనాయుడు జ్ఞాప కార్థం వీరి కుమారుడు ఇంద్రసేనా నాయుడు ఉభయదారుగా వ్యవహించనున్నారు.