desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:46AM

మద్యం, పెట్రోలు మాకొదిలేయండి!


కేంద్రానికి స్పష్టం చేసిన టీ ప్రభుత్వం
జీఎస్‌టీపై ఆర్థిక సంఘం భేటీలో ఈటెల

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జీఎస్‌టీ పన్నుల విధా నానికి.. కొన్ని షరతులకు లోబడి మద్దతు ఇస్తా మని తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సం ఘానికి తెలిపింది. ఎక్సైజ్‌, పెట్రోలియం ఉత్ప త్తులు, ధాన్యం మొదలైన వాటిపై పన్నుల్ని తామే విధించుకుంటామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా జీఎస్‌టీ కింద ఒకే పన్ను విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు రాషా్ట్రలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక విజ్ఞాన్‌ భవన్‌లో బుధవారం అన్ని రాషా్ట్రల ఆర్థిక శాఖ మంత్రులతో సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఈటెల రాజేందర్‌.. సమావేశం అనంతరం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 2005 నుంచి వ్యాట్‌ పన్ను విధానాన్ని కేంద్రం అమలు చేసిందని, దాని కారణంగా నష్టపోయిన రాషా్ట్రలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్రం ఇప్పటి వరకూ చెల్లించలేదని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.17,595 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అందులో రూ.5 వేల కోట్లు మాత్రమే ఇవ్వగలిగారని వివరించారు. అందులో గడచిన ఆర్థిక సంవత్సరం వరకూ తెలంగాణ వాటా రూ.5162 కోట్లని చెప్పారు. కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పాత బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలా కాకుండా కొత్తగా జీఎస్‌టీని ప్రవేశపెడితే రాషా్ట్రలు కఠినమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బడ్జెట్‌ ఆలస్యం కావటం రాజ్యాంగ విరుద్ధం కాదన్న ఆయన..ఎవ్వరూ ఊహించని రీతిలో గొప్పగా తమ బడ్జెట్‌ ఉంటుందన్నారు.
రాష్ట్రాల నష్టాన్ని భరిస్తేనే..: యనమల
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్రానికి కలిగే ఆర్థిక నష్టాన్ని కేంద్రమే పూరించాలని.. అలాగైతేనే దాని అమలుకు ఆమోదం తెలుపుతామని ఏపీ ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి యనమల.. సమావేశంలో తేల్చిచెప్పారు. జీఎస్టీని అమలు చేయడం వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని డిమాండ్‌ చేశారు. వీలైతే రాజ్యాంగ పరిధిలో దీనిని ఉంచాలని కోరారు. జీ ఎస్టీని వ్యవసాయ ఉత్పత్తులకు అమలు చేయ రాదని.. వీటిని జీఎస్‌టీ పరిధి నుంచి తప్పిం చాలని, కుదరదనుకుంటే వ్యవసాయ ఉత్పత్తికి తగినట్టుగా పన్ను ఆదాయాన్ని నిర్ణయించి దానిని రాష్ర్టాలకు ఇవ్వాలని సూచించారు.
ఇందుకు అవసరమైన సిఫారస ులను ఆర్థిక సంఘం రూపొందించి కేంద్రానికి పంపించాలని కోరారు. అలాగే.. పెట్రో ఉత్పత్తులనూ జీఎస్‌టీ పరిధి నుంచి తప్పించాలని, వాటిపై ఆయా రాష్ర్టాలే తదను గుణంగా పన్నులు విధించుకుం టాయని సూచించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నులతో లభించే ఆదాయం.. జీఎస్‌టీ అమలు వల్ల వచ్చే ఆదాయం సమంగా ఉంటే ఇబ్బంది ఉండదన్నారు. అలాకాకుండా.. జీఎస్‌టీ అమలుతో కలిగే నష్టం కలిగితే దాన్ని భరిస్తామని కేంద్రం హామీ ఇచ్చి విశ్వాసం కలిగిస్తేనే దాని అమలు సులభతరం అవుతుందన్నారు. ఇదిగాక సీఎస్టీ కింద రాష్ర్టాలకు కొన్నేళ్లుగా ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏపీకిదాదాపు రూ.7200 కోట్లు సీఎస్టీ బకాయిలు రావాల్సి ఉందన్నారు. వాటిని ఇవ్వక పోవడం వల్ల రాష్ర్టాలు కేంద్రంపై నమ్మకం కోల్పోతున్నాయన్నారు. విభజన దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఉందన్న యనమల..ఆ ఆర్థిక ఒత్తిడి నుంచి రాష్ట్రం బయటపడేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రం తగినన్ని నిధులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు. జీఎస్‌టీ సమావేశంతో సంబంధం లేకపోయినా ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రస్తావించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు రకాల సంస్థలు ముందుకు వస్తున్నాయని ప్రత్యేక హోదా ఇచ్చినట్టయితే మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెడతాయన్నారు.