Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:46AM

వైసీపీ నాయకురాలి ఆత్మహత్యాయత్నం






తొట్టంబేడు: మండలంలోని బోనుపల్లికి చెందిన వైసీపీ నాయకురాలు జయసుధ బుధవారం ఆత్మహత్యకు యత్నించారు. బాధితురాలు తెలిపిన ప్రకారం.. బోనుపల్లికి చెందిన జయసుధ ఇటీవల ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆమె శ్రీకాళహస్తిలో ఉంటున్నారు. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో జనాభా లెక్కల సేకరణకురాగా, జయసుధ గ్రామంలో ఉండటంలేదని స్థానికులు వారికి తెలిపినట్లు తెలిసింది. దీనిపై ఆమె బుధవారం గ్రామానికి వచ్చి సర్పంచి భర్తను నిలదీశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో జయసుధ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబీకులు శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఆస్పత్రిలో ఉన్న ఈమెను శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నాయకులు అంజూరు శ్రీనివాసులు, వాసుదేవనాయుడు, కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడరు మిద్దెల హరి, కొట్టెడు మధు తదితరులు పరామర్శించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, జయసుధ తన అనుచరులతో కలిసి దాడిచేసినట్లు సర్పంచ్‌ భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.