Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:46AM

రేపు సీఎం చంద్రబాబు రాక




చిత్తూరు అర్బన్‌: తిరుపతికి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్నట్లు కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని.. అక్కడ్నుంచి హోటల్‌ ఫార్చుస్‌ గ్రాండ్‌రిడ్జ్‌కు రోడ్డు మార్గాన చేరుకుంటారన్నారు. 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 14వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌, సభ్యులతో భేటీ అవుతారన్నారు. 2 గంటలకు రిజర్వులో ఉంటారని, తదుపరి నిర్వహించే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.
అధికారులంతా తిరుపతిలోనే..: గురు, శుక్రవారాల్లో ఆర్థిక సంఘం సమావేశాలు.. సీఎం రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులంతా తిరుపతి వెళ్లారు. డీఆర్వో శేషయ్య, ఏవోలు మినహా మిగిలిన అధికారులు తిరుపతికి వెళ్లడంతో కలెక్టరేట్‌ బోసిపోయింది. శనివారం వరకు జిల్లా అధికారులంతా తిరుపతిలోనే ఉండే అవకాశం ఉంది.