Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:46AM

మెట్రో స్టేషన్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు


ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ : మెట్రోస్టేషన్లలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తామని, ప్రయాణి కుల లగేజి స్కానింగ్‌ సహా అనుమ తించిన వారికి మాత్రమే లోనికి ప్రవేశం కల్పిస్తామని, సీసీ టీవీ కెమె రాల ద్వారా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తామని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైలు భద్రతా ప్రణాళికపై ఆయన బుధవారం సైబరాబాద్‌ సీపీ సీవీ.ఆనంద్‌, ఇతర పోలీసు ఉన్నతాధి కారులు, భద్రతా నిపుణులు, ఎల్‌అండ్‌టీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎంఆర్‌కు ప్రయాణికుల భద్రత అత్యంత ప్రాధాన్యమని, అన్ని రకాల సెన్సర్లు, అలారంతో పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తా మని చెప్పారు. రైళ్లలో కూడా వీడియో రికార్డింగ్‌, ప్రయాణికులను కాన్‌కోర్స్‌ గేట్ల వద్ద తనిఖీ చేయడం, చొరబాటు నిరోధక వ్యవస్థలు, కుట్రల నిరోధక వ్యవస్థలు అన్నీ ఉంటాయన్నారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీఆనంద్‌ మాట్లాడుతూ జంట కమిషనరేట్ల ప్రతినిధులు, హెచ్‌ఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ ప్రతినిధు లతో కలిపి సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ మెట్రోరైలుకు సంబంధించిన నేరాలను చూసేందుకు ప్రత్యేక పోలీసు స్టేషన్‌, అదనపు భద్రతాదళాలను ఏర్పాటుచేస్తామని అన్నారు. మెట్రో స్టేషన్లు, పార్కింగ్‌, సర్క్యులేషన్‌ ఏరియా, వయడక్ట్‌, ట్రాక్‌, రైళ్లు, డిపోలు, కీలక వ్యవస్థలు, యంత్రాంగం, ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్‌ తదితర ప్రాంతాలకు భద్రత కల్పించడంపై కూడా సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు తదితర మెట్రో రైలు వ్యవస్థలకు చేసిన భద్రతా ఏర్పాట్లనూ చర్చించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలతో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులతో చర్చించి భద్రతా ఏర్పాట్లను ఖరారు చేయనున్నారు. ప్రముఖ ఉగ్రవాద నిరోధ నిపుణుడు, రిటైర్డ్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కేసీరెడ్డి ఈ విషయంలో ఓ నివేదిక సమర్పిం చారు. సమావేశంలో అదనపు సీపీలు సందీప్‌శాండిల్య, అంజనీకుమార్‌, జాయింట్‌ సీపీ గంగాధర్‌, ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ పీడీ ఎంపీ నాయుడు, సివిల్‌ సిస్టమ్స్‌ హెడ్‌ అనిల్‌కుమార్‌ సైని తదితరులు పాల్గొన్నారు. ట.్ట