Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:44AM

సాక్షి నిష్క్రమణ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

తాష్కెంట్‌: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళారెజ్లర్‌ సాక్షి మాలిక్‌ క్వార్టర్‌ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన 60కిలోల ఫ్రీస్టయిల్‌ క్వార్టర్స్‌లో సాక్షి 1-3తో పెట్రా మారిట్‌ (ఫిన్లాండ్‌) చేతిలో చిత్తయింది. కాగా, ప్రియాంకా సింగ్‌, పూజా దండ, సుమన్‌ కుందు తొలిరౌండ్‌తోనే సరిపెట్టుకున్నారు. 55 కిలోల విభాగంలో పూజ 0-4తో బాట్సెస్టెగ్‌ (మంగోలియా) చేతిలో, ప్రియాంక 0-4తో ఎమిలియా (రొమానియా) చేతిలో చిత్తయ్యారు. ఇక 69 కిలోల ఈవెంట్‌లో వొరొబెవా (రష్యా) 5-0తో సుమన్‌ కుందును ఓడించింది.