desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:40AM

రైల్వేలో విదేశీ పెట్టుబడులను సహించం: రాఘవయ్య


సికింద్రాబాద్‌/ హైదరాబాద్‌, సెప్టెంబర్‌10: రైల్వేలో విదేశీ పెట్టుబడులను సహించేది లేదని, కార్మికులు, ఉద్యోగులతో కలిసి భారీ ఉద్యమం చేపడతామని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌, దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కేంద్రాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం ఆవరణలో బుధవారం సంఘ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రదర్శన, సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం హైస్పీడ్‌ కారిడార్‌, బుల్లెట్‌ రైళ్లు తదితర సదుపాయాలను సాకుగా చూపుతూ... రైల్వేలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.