desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:40AM

ఎరువులు, బియ్యం, నీలి కిరోసిన్‌ పట్టివేత


గుంటూరు, సెప్టెంబర్‌ 10: గుంటూరు జిల్లాలో విజిలెన్స్‌ అధికారులు మూడు ప్రాంతాల్లో దాడులు జరిపి నల్ల బజారుకు తరలిపోతున్న ఎరువులు, రేషన్‌ బియ్యం, నీలి కిరోసిన్‌ను పట్టుకున్నారు. గుంటూరు నల్లపాడు సమీపంలో ఓ లారీలో తరలిస్తున్న రూ.1.60 లక్షల విలువ చేసే 200 బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులను చిలకలూరిపేట నుంచి ఓ లారీలో ప్రొద్దుటూరుకు తరలిస్తున్న రూ.3.60 లక్షల విలువ చేసే 140 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాఽధీనం చేసుకున్నారు. తురకపాలెం సమీపంలో ఆర్టీసీ బస్పులో తరలిస్తున్న 130 లీటర్ల నీలి కిరోసిన్‌ను పట్టుకుని ఇద్దర్ని అరెస్టు చేశారు. 0.111