Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:36AM

వచ్చే నెల ఆరు నుంచి విశాఖ-తిరుపతి ప్రత్యేక రైళ్లు



విశాఖపట్నం,సెప్టెంబర్‌10: ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ-తిరుపతి మధ్య ప్రత్యేక వారాంతపు రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ యల్వేందర్‌యాదవ్‌ తెలిపారు.ఈ సర్వీసులు అక్టోబర్‌ ఆరు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు అందుబాటులోఉంటాయని పేర్కొన్నారు.
విశాఖ-తిరుపతి (12873)
02873 నంబర్‌ గల రైలు అక్టోబర్‌ 6, 13, 20, 27, నవంబర్‌ 3,10,17,24,డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో (ప్రతి సోమవారం) సాయంత్రం 4.45 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 4.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుపతి-విశాఖ (02874)
02874 నంబర్‌ గల రైలు అక్టోబర్‌ 7, 14, 21, 28, నవంబర్‌ 4, 11, 18, 25, డిసెంబర్‌ 2, 9, 16, 23, 30 తేదీల్లో (ప్రతి మంగళవారం) సాయంత్రం 4.00 గంటలకు తిరుపతిలో బయలుదేరి మర్నాడు ఉదయం 5.15 గంటల కు విశాఖ చేరుతుంది. భీరీ.8