Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:36AM

ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి: జడ్పీ చైర్మన్‌



డోన్‌: సమాజం మీద సైన్సు ఎంతో ప్రభా వం చూపుతుందని ప్రతి విద్యార్థి కూడా ఒక శాస్త్రవేత్తగా ఎదగాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మల్లెల రాజశేఖర్‌, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డి అన్నారు. బుధవారం డోన్‌ పట్టణంలోని ఒనైరో స్కూల్‌లో రెండురోజులపాటు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రా జశేఖర్‌ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచం లో సైన్సులో ఎన్నో మార్పులు వస్తున్నాయన్నా రు. ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే బుగ్గన మాట్లాడుతూ ప్రపంచానికి దీటుగా దేశంలో సైన్సు అభివృద్ధి చెందుతోందని, మన దేశంలోనే శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉండటం గర్వకారణమన్నారు. ఇలాంటి సైన్స్‌ ఫెయిర్‌ల వల్ల విద్యార్థుల మేధోసంపత్తిని వెలికితీయవచ్చన్నారు. జిల్లా విద్యాధికారి సహదేవుడు మా ట్లాడుతూ మనిషి జీవితమే సైన్సు మీద ఆఽధార పడి ఉందన్నారు. విద్యార్థులు సైన్సు పట్ల ఆసక్తి పెంచుకొని భావితర యువ శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలందించాలన్నారు. కార్యక్రమంలో డోన్‌ జడ్పీటీసీ శ్రీరాములు, ఎంపీపీ లక్ష్మీదేవి, ఒనైరో స్కూల్‌ డైరెక్టర్స్‌ కోట్రికె ఫణిరాజ్‌, మ హేష్‌ఖన్నా, మురళీకృష్ణగౌడ్‌, తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.నాగేశ్వరరావుయాదవ్‌, డిప్యూటీ డీఈవోలు జయరామ్‌, శైలజా, ఎం పీడీవో క్యాథరిన్‌, ఎంఈవో రామచంద్రుడు, యూటీఎఫ్‌ రాష్ట్ర సహా అధ్యక్షుడు నరసింహు డు, ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి షన్మూర్తి, సైన్స్‌ఫెయిర్‌ మాజీ అధికారి జయచంద్రారెడ్డి, ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ నాయకులు వేణుగోపాల్‌, రామకృష్ణ పాల్గొన్నారు.