Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

క్వారీ కార్మికులకు ఉపాధి కల్పించాలికర్నూలు (న్యూసిటీ): క్వారీలలో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి కల్పించాలని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కలెక్టర్‌ను కోరారు. బుధవారం మీరాపురం, యనకండ్ల గ్రామాల క్వారీ కార్మికులతో కలిసి ఆయన కలెక్టర్‌, జేసీలను కలిశారు. బనగాలపల్లె మండ లం మీరాపురం, యనకండ్ల గ్రామాల్లోని ప్ర జలు సంవత్సరాలుగా క్వారీలపైనే జీవనం సాగిస్తున్నారన్నారు. క్వారీలను సిమెంట్‌ ఫ్లాక్టరీకి లీజుకు ఇవ్వడం వల్ల దాదాపు వెయ్యి మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతారని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి వివరించారు. వీరందరికీ ప్రత్యామ్నయంగా ఉపాధి కల్పించాలని కోరారు. గతంలో జై జ్యోతి సిమెంట్‌కు లీజుకు ఇచ్చిన విషయాన్ని తదితర అంశాల ను కలెక్టర్‌ ముందు ఉంచారు. దీంతో కలెక్టర్‌ స్పందించి పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. అంతకుముందు గ్రామస్థులు మా ట్లాడుతూ దాదాపు 180 ఎకరాల్లో ఉన్న క్వారీలో 40 సంవత్సరాలుగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. గతంలో ప్రభుత్వం దాన్ని జై జ్యోతి సిమెంటు ఫ్యాక్టరీకి లీజుకు ఇచ్చిందన్నారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ నుం చి ఓ ప్రజాప్రతినిధి లీజుకు తీసుకొని తమను పనులు చేసుకోకుండా అడ్డు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయంపై పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి నా ఫలితం లేదన్నారు. రెండు నెలలుగా పనులు లేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యామ్నయంగా ఉపాధి చూపాలని కలెక్టర్‌ను కోరామన్నారు. కలెక్ట ర్‌ కార్యాలయానికి టీడీపీ నేతలు పాతిమా, యాగంటయ్య, మహిళలు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు.