Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

పనితీరు మారకపోతే ఇంటికేకర్నూలు (పాతబస్తీ): అంగన్‌వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న సీడీపీవోల పనితీరు మా రకపోతే ఇంటికి పంపిస్తామని కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ కాన్ఫరెన్సు హాలులో ఐసీడీఎస్‌ శాఖ పని తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని అంగన్‌వాడీ కేంద్రాలు.. ఎన్ని సొంత భవనాలు.. మరమ్మతు చేయాల్సినవి ఎన్ని తదితర వివరాలతో నివేదిక తయారు చేసి ఏజేసీకి అం దజేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ బోర్డులను ఏర్పాటు చేసి వాటి ప్రకారమే పౌ ష్టికాహారం అందజేయాలన్నారు. గర్భిణుల ఇంటి వద్దకు వెళ్లి పౌష్టికాహారం అందించాలన్నారు. అలా చేయలేని వారు తమ రాజీనామా పత్రా న్ని ఇస్తే ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా కొత్త వారిని తీ సుకుంటామని హెచ్చరించారు. సమయపాలన పాటించాలన్నారు. ఏవైనా పొరపాట్లు, అ వకతవకలు ఉంటే సీడీపీవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్వాలిటీ కమిటీ రిపోర్టు ఏర్పాటు చేసి తరచుగా పర్యవేక్షించాలని ఏజేసీకి సూచించారు. అధికారులు సీట్లకే పరిమితం కాకుండా క్షేత్ర పర్యటన చే యాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు ఏఎన్‌ఎం, వీఆర్‌ఏ, ఆశా వర్కర్లు సమన్వయం చేసుకుని ప్రజల్లో అవ గాహన కల్పించాలన్నారు. నెలకు 20 రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఏజేసీ అశోక్‌కుమార్‌, ఐసీడీఎస్‌ పీడీ ముత్యాలమ్మ, డీసీపీవో హిమబిందు సీడీపీవోలు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.