Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

నగరంలో చెలరేగిన గొలుసు దొంగలు





కర్నూలు(క్రైం): నగరంలో గొలుసు దొంగలు పెట్రేగిపోయారు. బుధవారం రెండు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడి 11 తులాల బంగారు నగలు అపహరించారు. మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో గణేశ్‌నగర్‌లో లలితమ్మ అనే మహిళ మెడలోనుంచి ఆరు తులాల బంగారు గొలుసు అపహరించారు. భర్త మృతి చెందడంతో లలిత తన తల్లివద్దే ఉంటోంది. బుధవారం మోటారు సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి ఓ ఇంటి అడ్రస్‌ కావాలని అడిగారు. తనకు తెలియదంటూ సమాచారం ఇచ్చి వెనుదిరిగేలోపే ఆమె మెడలోని గొలుసు తెంపుకుని ఉడాయించా రు. బాధితురాలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. అలాగే నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో కల్లూరు ఎస్టేట్‌లో ఎల్లేశ్వరమ్మ అనే మహిళ మెడలోనుంచి 5 తులాల బంగారు తెంపుకుని ఉడాయించారు. ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై వచ్చి ఆమె మెడలోని గెలు సు తెంపుకొని పరారయ్యారు. నాల్గో పట్టణ పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. ఈ రెండు సంఘటనలతో నగరంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎస్పీ రవికృష్ణ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టారు. టూటౌన్‌ సీఐ బాబుప్రసాద్‌ ఆధ్వర్యంలో పలు కాలనీల్లో కరపత్రాలు పంచారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలంటూ అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కనిపించినా పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని, ఇంటింటికి తిరిగి సూచనలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.