Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

పొడిగింపులే గానీ ముగింపు ఏదీ?



నందికొట్కూరు రూరల్‌: హంద్రీనీవా, కేసీ కాలువకు కృ ష్ణా మిగులు జలాలను అందించేందుకు ముచ్చుమర్రి వద్ద చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులు నాలుగేళ్లుగా నిలిచి పోయాయి. కంట్రోల్‌ బ్లాస్టింగ్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ప్రభుత్వం పనుల పూ ర్తికి గడువు మీద గడువు పెంచుతోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు పూర్తి చేసి సాగు నీటిని అందిస్తారన్న ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 879 అడుగులకు చేరుకున్నప్పుడు హంద్రీనీవాకు నీటిని అందించేందుకు సంగమేశ్వరం నుంచి కృష్ణా మిగులు జ లాలను తరలించేందుకు ముచ్చుమర్రి వద్ద 2008లో రూ. 249 కోట్లతో ఎత్తిపోతల రిజర్వాయర్‌, అప్రోచ్‌, లింక్‌ చానల్‌ కాలువ పనులు చేపట్టారు. ముచ్చుమర్రి నుంచి మల్యాల మొదటి ఎత్తిపోథల వరకు 9 కిలో మీటర్లు లింక్‌ చానల్‌ కాలువ తవ్వేందుకు రూ.70.37 కోట్లు కేటాయించ గా ఇప్పటి వరకు రూ.12.27 కోట్లు కాలువ తవ్వకానికి ఖర్చు చేశారు. ముచ్చుమర్రి వద్ద ఎత్తిపోతలు అప్రోచ్‌ కాలువకు రూ.162.37 కోట్లు మంజూరు చేసింది. 2008లో ఎత్తిపో తల రిజర్వాయర్‌ పనులను చేపట్టి రూ.71.37 కోట్లు ఖర్చు చేశారు. ఎత్తిపోతల పనులకు ఉపయోగించే బ్లాస్టింగ్‌ వల్లఇళ్లు బీటలువారుతున్నాయని గ్రామస్థులు అడ్డుకోవ డంతో 2009లో పనులు నిలిచిపోయాయి. దీంతో 2010 జూన్‌కు పూర్తి కావాల్సిన పనుల గడువును 2011 జూన్‌ 20వ తేదీ వరకు పొడిగించారు. కంట్రోల్‌ బ్లాస్టింగ్‌కు అను మతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ అనుమతి ఇవ్వలేదు. పనులను పూర్తి చేసేందుకు గడువు ను మరో ఏడాది 2013 జూన్‌ 30 వరకు పొడిగించారు. ప్రభుత్వం గడువు మీద గడువు పొడిగిస్తుందే తప్ప పనులు మాత్రం పూర్తి కావడం లేదు. 2014లో ఫిబ్రవ రిలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పనులతో కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ కు అనుమతిస్తూ రూ.20 కోట్ల నిధులను అదనంగా ప్రభు త్వం మంజూరు చేసింది. ఈ పనులను పూర్తి చేసేందుకు గడువును 2015 డిసెంబర్‌ ఆఖరి వరకు పొడగిస్తూ ఉ త్తర్వులు జారీ చేసింది. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ను తొలగించాలని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి సిఫార్స్‌ చేసినా ఫలి తం లేదు. ముచ్చుమర్రి పనులను పూర్తి చేసి కేసీ కాలువ కు సాగు నీరు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం. టీడీపీ నాయకు లు మాండ్ర శివానందారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి ముచ్చుమర్రి పనులను పూర్తి చేసి కేసీ కాలువకు సాగు నీరు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పనుల పూర్తి కోసం నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కూడా తీవ్ర ప్రయత్నా లు సాగిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా నదికి పూర్తి స్థాయిలో నీరు రావడంతో అప్రోచ్‌ కాలువ, ఎత్తిపోతల రిజర్వాయర్‌ కూడా నీటిలో మునిగింది. ప్రభుత్వ హయాంలో పనులు పూర్తయి కేసీ కాలవ కింద రబీ పంటకు సాగు నీరందుతుందని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు.