Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

శ్రీమఠం పీఠాధిపతికి తులాభారం



మంత్రాలయం: రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులైన సుభుదేంద్రతీర్థులకు శ్రీమఠం ఆధ్వర్యంలో తులాభారం వైభవంగా నిర్వహించారు. చాత్రుమాస విరమణలో భాగంగా పీఠాధిపతి సీమోల్లంఘన కార్యక్రమం పుర వీధుల్లో మేళతాళలు, మంగళ వాయిద్యాలతో, భక్త జనుల కొలాటాలతో కన్నుల పండువగా జరిగింది. అనంతరం శ్రీమఠం ప్రాంగణంలోని యోగేంద్ర మండపంలో పీఠాధిపతులకు ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచారి ఆధ్వర్యంలో తులాభారం కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా పీఠాధిపతుల చిత్రపటం అవిష్కరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పగడాల ఆనందతీర్థ ఆచారి పండ్లతో తులాభారం నిర్వహించారు. పీఠాధిపతులకు తలపాగా, పూలమాల, శేష వస్త్రం, పూల ధనస్సు, కీరిటం బహూకరించి సన్మానిచారు. శ్రీమఠం తరపున రూపాయి నాణాలతో గోపి చందనంతో తులాభారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక అసన జిల్లాకు చెందిన స్వాతి బరద్వాజ్‌ భరతనాట్య కార్యక్రమం, అలాగే గంగావతికి చెందిన తొమ్మిది మంది డోలు వాయిద్య కారుల కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ జయనాగేశ్వరరెడ్డి సతీసమేతంగా హాజరై పీఠాధిపతులను సన్మానించారు. పీఠాధిపతి వీరికి శేషవస్త్రం, ఫల, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. మంత్రాలయం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ టీడీపీ నాయకులు పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, పన్నాగ వెంకటేష్‌ స్వామి, కర్ణాటక పారిశ్రామిక వేత్త తిప్పన్న, భజన భక్త మండలి భక్తాదులు పాల్గొన్నారు.