Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

కర్నూలులో జర్నలిస్టుల నిరసన




కర్నూలు (ఎన్టీఆర్‌ సర్కిల్‌):
హైదరాబాద్‌లో మహిళా జర్నలిస్టులపై పోలీసుల లాఠీచార్జ్‌ను నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తక్షణమే తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ-9 చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృపవరం మాట్లాడుతూ కేసీఆర్‌ తుగ్లక్‌ మాదిరి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేకించి ఏబీఎన్‌, టీవీ-9 చానళ్లను తెలంగాణలో తొలగించాలని ఎంహెచ్‌వోలపై ఒత్తిడి తెచ్చారన్నారు.
అనంతరం ఏపీడబ్ల్యూజే నాయకులు జిల్లాకలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు హరినాథ్‌రెడ్డి, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.