Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:35AM

బాలలపై కేసుల విచారణలో పోలీసులు జాగ్రత్త వహించాలి



కర్నూలు (లీగల్‌): చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బాలలపై కేసులు నమోదు, విచారణ విషయంలో పోలీసులు అత్యంత జాగ్రత్త వహిం చాలని కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్‌ ప్రధాన న్యాయమూర్తి ఎ.వెంకటజ్యోతిర్మయి పేర్కొన్నారు. బుధవారం స్థానిక న్యాయసేవాసదన్‌ భవనంలో ఏఎస్‌ ఐలు, బాలల సంక్షేమ అధికారులు, జువనైల్‌ బోర్డు సభ్యుల శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు తప్పనిసరిగా పాటించాలన్నా రు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారిపై బలప్రయోగం చేయకూడదన్నారు. వారి గుర్తింపు తెలి సేలా వ్యవహరించరాదని తెలిపారు. కార్యక్రమం లో జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి జి.ఆదినారాయణ, జువనైల్‌ కోర్టు మెజిస్ర్టేట్‌ ఎన్‌. శ్రీనివాసరావు, ఏఎస్పీ ఎస్‌.బాబురావు, బాలల సంక్షేమ సంస్థ చైర్మన్‌ చిన్నయ్య, జువనైల్‌ బోర్డు సభ్యులు ప్రసన్నకుమారి, ఖలీద్‌, కర్నూలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎ.చంద్రమౌళీశ్వరరెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.