Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:34AM

శ్రీమఠం అభివృద్ధికి సహకరిస్తామంత్రాలయం:రాఘవేంద్ర స్వామి మఠం అ భివృద్ధికి సహకరిస్తానని కర్ణాటక మాజీ ముఖ్యమం త్రి, శివమొగ్గ ఎంపీ యడ్యూరప్ప అన్నారు. బుధవా రం ఆయన రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రా లయం వచ్చారు. బృందావనం దర్శనం అనంతరం పీఠాధిపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ శ్రీమఠం అభివృద్ధికి, ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు అయిన మాధవరం దగ్గర బ్రిడ్జికి చేసిన సహకారం మరువలేనిదన్నారు. శ్రీమఠం అభివృద్ధికి తోడ్పాడలని పీఠాధిపతులు కోరారు. ఈ సందర్భంగా యడ్యూరప్ప మాట్లాడుతూ శ్రీమఠం అభివృద్ధికిసహకారం అందిస్తామని తెలిపారు. అ నంతరం శ్రీమఠం అఽధికారులు యడ్యూరప్ప శోభ కరన్‌లాజేకు రాఘవేంద్ర స్వామి 180 సంవత్సరాల క్రితం రచించిన పురాతన తాళపత్ర గ్రంథాలను చూపించారు. ఇందులో తత్వ ప్రకాశిక బోధన, శప్త వేద గ్రంథం, బాట్ట సంగ్రహం గ్రంథాలను వారికి చూపించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త తిప్పన్న, కర్ణాటక ఎమ్మెల్సీ పీఎస్‌ విజయ్‌, శంకరప్ప, రాయచూర్‌ బీజెపీ ఆధ్యక్షుడు బసవన్నగౌడులు, శ్రీమఠం అధికారులు ఏఏవో మాధవశెట్టి, జోనల్‌ మేనేజరు శ్రీపతి, మేనేజరు శ్రీనివాసరావు, అసిస్టెం ట్‌ మేనేజరు ఐపి నరసింహా, పీఆర్వో రాఘవేం ద్రరావు, ద్వారపాలక అనంత ఉన్నారు.
గ్రామాభివృద్ధికి సహకరించాలని
యూడ్యరప్పకు వినతి
ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం గ్రామాభి వృద్ధికి సహకరించాలని కర్ణాటక మాజీ సీఎం య డ్యూరప్పకు మంత్రాలయం గ్రామ సర్పంచ్‌ భీమయ్య వినతిపత్రం అందజేశారు. అండర్‌ డ్రైనేజీ, తాగునీ టి సమస్య, సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.