Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:34AM

చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నాయకుడునందికొట్కూరు టౌన్‌: ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో పయనిస్తుందని మాజీ ఎమెల్యే లబ్బి వెంకటస్వామి అన్నారు. బుధవారం పట్టణం లోని రబ్బాని కాంప్లెక్స్‌లో విలేఖరుల సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వైఫల్యం కార ణంగానే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు నిలిచిపో యాయని కాగ్‌ నివేదిక ఇచ్చిందన్నారు. వ్యవ సాయ, విద్యుత్‌, నీటి పారుదల, విద్య, వైద్య, ఉపాఽధి, పారిశ్రామిక రంగాల్లో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని గుర్తు చేశారు. చంద్రబా బు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించడం హర్షణీయమ న్నారు. జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. విత్తనోత్పత్తి కేంద్రం, టెక్స్‌టైల్‌ పార్కు, ఐఐటీ, స్మార్ట్‌ సిటీ, సిమెంట్‌ పరిశ్రమలు, ఎయిర్‌ పోర్ట్‌, మైనింగ్‌ పాఠశాలలు, సోలార్‌హబ్‌, ప్రకటించారని, త ద్వారా జిల్లా అభివృద్ధి బాటలో ఉంటుందన్నా రు. ఫోర్‌లైన్‌ రోడ్లతో జిల్లా అభివృద్ధి చెందు తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తంగడం చ సీడ్‌ ఫారమ్‌ను వ్యవసాయ క్షేత్రంగా, రోళ్ల పాడు అభయారణ్యంలో నేషనల్‌ జూపార్కు ఏర్పాటు చేయాలని చంద్రబాబును కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. రాజధాని ప్రకటనపై వైసీపీ ఎమ్మెల్యేలు జిల్లాలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కోప్షన్‌ మెంబర్‌లు జాకీర్‌ హుస్సేన్‌, కృష్ణారెడ్డి, మద్దూరు హరిస ర్వోత్తమరెడ్డి, చల్లా సుభాష్‌ రెడ్డి, రామిరెడ్డి, టీడీపీ యూత్‌ నాయకులు ఇనాయితుల్లా, అండ్రెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.