Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:33AM

నిరుపేదలకు ఉచిత వైద్యం


తెలుగు విద్యార్థులకు మైనార్టీ కోటాలో సీట్లు
ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్‌ కళాశాల చైౖర్మన్‌ నరసరాజు

బెంగళూరు, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్‌ కళాశాలకు అనుబంధ ఆసు పత్రి ద్వారా పేదలకు ఉ చితంగా వైద్యం చేయనున్నట్లు చైర్మన్‌ నరసరా జు వెల్లడించారు. పెజావర పీఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామీజీతో పాటు ఆక్స్‌ఫర్డ్‌ చైౖల్డ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌రాజు తదితరుల ఆధ్వర్యంలో బుధవారం ఆక్స్‌ఫర్డ్‌ మెడికల్‌ కళాశాల, ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల ద్వారా తెలుగు మైనార్టీ కోటాలో కూడా సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రస్తుతం మెడికల్‌ కళాశాలలోను లింగ్విస్టిక్‌ కోటా కింద అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తానొక ఉపాధ్యాయుడిగా పనిచేశానని, ఇప్పటికే ఇంజనీరింగ్‌, డెంటల్‌ కళాశాలల ద్వారా ఏటా వేలాది మందికి విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. బెంగళూరు-తమిళనాడు హోసూరుల మధ్యన అత్తిబెలె వద్ద మెడికల్‌ కళాశాలను 32 ఎకరాల సుఽవిశాలమైన ప్రాంతంలో రూ.350 కోట్లతో ఆరంభించామన్నారు. ఇప్పటికే రూ.160 కోట్లతో నిర్మాణాలు జరిపామని పనులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా 700ల పడకల ఆసుపత్రి లక్ష్యంగా ప్రస్తుతం 300ల పడకలతో ఆరంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం మొదటి ఏడాది మెడికల్‌ విద్యార్థులకు అడ్మిషన్‌లు జరుగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుతో అన్ని ప్రాంతాల వారికి ఉన్నతమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తన లక్ష్యమన్నారు. ాట్ఞ+ీఖి