desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:33AM

రహదారిపై నగదు బ్యాగ్‌... ఛేజింగ్‌లో దొరికిన దొంగలు


లెక్కతేలింది రూ.20 లక్షలే
అమలాపురం రూరల్‌/ కాట్రేనికోన, సెప్టెంబర్‌ 10 : తూర్పుగోదావరి జిల్లా భట్నవిల్లి వద్ద బుధవారం ఒక్కసారిగా వెళుతున్న కారు నుంచి ఓ బ్యాగ్‌ రహదారిపై పడింది. బ్యాగ్‌లో రూ.500 నోట్ల కట్టలు కనిపించడంతో అందరూఆశ్చర్యపోయారు. కారులో ఉన్న వారిని కాట్రేనికోన పోలీసులు ఛేజింగ్‌ చేసి పట్టుకున్నారు. వారు దొంగలుగా తేలడంతో అదుపులో తీసుకున్నారు. బ్యాగ్‌లో ఉన్న నగదును లెక్కించగా రూ.20 లక్షలుగా లెక్కతేలింది. అమలాపురం ఎర్రవంతెన వద్ద రోయ్యలవ్యాపారి యనమదల వేణుబాబు బుధవారం ఈదరపల్లిలోని యాక్సిస్‌ బ్యాంకు నుంచి రూ.25 లక్షలు డ్రా చేసినట్టు అతని వద్ద పనిచేస్తున్న గుమస్తాలు తెలిపారు. నగదును తీసుకుని కారులో దుకాణం వద్దకు చేరుకున్న వేణు కారుకు తాళం వేయకపోవడం గమనించిన ఓ ముఠా నగదు బ్యాగ్‌ను తస్కరించి పరారైనట్టు పోలీసులకు వివరించారు. తేరుకున్న వేణు మోటారు సైకిల్‌పై ఆ కారును వెంబడించాడు. అతనికి మద్దతుగా మరికొందరు బైక్‌లపై వెళ్లారు. భట్నవిల్లి ప్రాంతం వచ్చేసరికి దొంగలు దోరికి పోతామనే భయంతో నగదు బ్యాగ్‌ను కారు నుంచి విసిరేశారు. ఆ విషయం తెలిసి డీసీసీబీ డైరెక్టర్‌ యిళ్ల సత్యగోపాలకృష్ణ పోలీసులకు సమాచారం అందించారు. భట్నవిల్లి నుంచి కారు ఛేజింగ్‌ కాట్రేనికోన మండలానికి మారింది. అక్కడ నుంచి దొంగల మారుతీకారును పోలీసులు ఛేజ్‌ చేశారు.కారు బలుసుతిప్ప వైపు వెళ్లి మరోమార్గంలేక వెనుదిరిగింది. పల్లంకుర్రులో కారును, కారులోవున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి పరారయ్యాడు. వీరు నెల్లూరుకు చెందిన వారుగా భావిస్తున్నారు.
కృష్ణాజిల్లాలో తనిఖీలలో రూ.25.5 లక్షల సీజ్‌
నందిగామ రూరల్‌: కృష్ణాజిల్లా నందిగామ శివారు అనాసాగరం చెక్‌పోస్టు వద్ద పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీలో రూ.25.50 లక్షలను పట్టుకున్నట్లు సీఐ భాస్కరరావు చెప్పారు. బుధవారం చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళుతున్న వాహనంలో నగదు పట్టుబడింది. సి.హెచ్‌.శ్రీనివాసరావు అనే వ్యక్తి గుంటూరు వద్ద భూమిని కొనుగోలు చేశాడు. అమ్మకందారునికి సొమ్ము చెల్లించేందుకు తీసుకు వెళుతున్నట్లు తెలిపారు.భిభ్బ్బిభభిట్ఞాఆ