Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:32AM

విజయవాడలో సివిల్‌ సప్లయిస్‌ రాష్ట్ర కార్యాలయం


వారానికి రెండు రోజులు అక్కడే: మంత్రి సునీత
గుంటూరు, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు సివిల్‌ సప్లయిస్‌ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. గుంటూరులో బుధవారం రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. వారానికి రెండు రోజులు అక్కడే ఉండి డీలర్లు, మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సునీత స్పష్టం చేశారు. త్వరలోనే విజయవాడలో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని ఆమె అన్నారు.
పరిటాల రవి హత్య కేసును పునర్విచారించాలి
మంగళగిరి: తన భర్త పరిటాల రవి హత్యకేసును పునర్విచారించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి సునీత అన్నారు. గుంటూరు జిల్లా మం గళగిరి లక్ష్మీనృసింహస్వామిని బుధవారం దర్శించుకున్న ఆమె విలేకర్లతో మాట్లాడారు. రవీంద్ర హత్య కేసులో జగన్‌ ఏ-1 నిందితునిగా వున్నట్టు తొలి నుంచి ఆరోపణలు వినవస్తున్నాయని, ఈకేసును తిరగతోడితే అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేలుతుందని చెప్పారు. కేసును పున ర్విచారించాలనేది కేవలం తన డిమాండ్‌ మాత్రమే కాదని, రవి అభిమాను లు, టీడీపీ నేతలు, కార్యకర్తలందరూ తిరిగి కేసును విచారించాలని కోరు తున్నారని చెప్పారు. రవి హత్యలో నిందితులకు శిక్ష పడేవరకు తాము పోరాటం చేస్తామన్నారు.
తక్కువ ధరకు బియ్యం ఇవ్వాలి: రైస్‌ మిల్లర్లను కోరిన మంత్రి
మార్కెట్‌లో దళారులను తొలగించి వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం, రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర ఇవ్వడానికి రైస్‌ మిల్లర్లు ప్రా ధాన్యం ఇవ్వాలని మంత్రి సునీత కోరారు. గుంటూరులో జరిగిన 13 జిల్లాలకు చెందిన ఏపీ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో మాట్లాడారు. రైస్‌ మిల్లర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మిల్లర్లు పేదవర్గాలకు అందుబాటులో ఉండాలన్నారు. వ్యవసాయ మంత్రి పుల్లారావు మాట్లాడుతూ పంటలను పండించే రైతులకు మంచి ధర ఇస్తూ వినియోగదారులకు తక్కువ ధరలో అందేవిధంగా దళారుల వ్యవస్థను రద్దు చేయాలన్నారు. రైతు బజార్ల ద్వారా సోనామసూరి బియ్యం కిలో రూ.30కు మిల్లర్లు అమ్మాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయడానికి గిడ్డంగులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సాధినేని మాట్లాడుతూ విజిలెన్స్‌ ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌, పోల్యూషన్‌ బోర్డ్‌ అధికారులు వేధిస్తున్నట్లు ఆరోపించారు. లెవీ విధానంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరిస్తారని హామీ ఇచ్చారు.