Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:30AM

అన్‌రాక్‌, జిందాల్‌ ఒప్పందాలు రద్దుచేస్తాం


బాక్సైట్‌పై గిరిజనుల మనోభావాలను గౌరవిస్తాం
వారి అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించబోం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
జలయజ్ఞంలో దోషులపై చర్యలు
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): విశాఖఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని రాష్ట్ర పం చాయతీరాజ్‌ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. విశాఖలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అన్‌రాక్‌, జిందాల్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు. బాక్సైట్‌ తవ్వకాలపై ప్రతిపక్షంలో వున్నప్పుడు టీడీపీ ఏనిర్ణయం తీసుకుందో... ఇప్పటికీ దానికే కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. గిరిజనులకు వ్యతిరేకంగా వెళ్లేది లేదన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలను ప్రైవేటు వ్యక్తులు/సంస్థలకు ఇచ్చే ప్రసక్తిలేదని అయ్యన్న తేల్చిచెప్పారు. ఒకవేళ గిరిజనులే ముందుకువస్తే ఐటీడీఏ లాంటి సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. బాక్సైట్‌ విషయంలో టీడీపీ వైఖరిలో మార్పులేదని, ఈ విషయంలో ఎటువంటి అపోహాలకు తావులేదన్నారు. గత నెలలో విశాఖలో జరిగిన గిరిజన సదస్సులో ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని తలొక విధంగా అన్వ యించుకున్నారన్నారు. ఏజెన్సీలోని అరకు లోయలో పర్యాటక అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డువస్తున్నాయని మంత్రి అన్నా రు. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో అటవీ చట్టం అమలులో వున్న తేడాను సమీక్షించాల్సిన అవసరం వుందన్నారు. జలయజ్ఞంలో 87 పనులకుగాను కేవలం నాలుగు పనులు మాత్రమే పూర్తిచేసిన విషయాన్ని కాగ్‌ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. శిశు సంక్షేమానికి 28 కోట్ల్లకు గాను కేవలం 6.5 కోట్లు, రైతు లకు పావలా వడ్దీ రుణాలు రూ.320 కోట్ల్లకు రూ.69 కోట్లు, డ్వాక్రా రుణాలకు సంబంధించి రూ.1003 కోట్ల్లకు రూ.474 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. ఇందిర జలప్రభలో పదేళ్లలో పది లక్షలకుగాను కేవలం 1.04 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చిన విషయాన్ని కాగ్‌ నివేదిక బహిర్గతం చేసిందన్నారు. క్రెస్తవుల సంక్షేమానికి 12.95 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో ఒక్కపైసా కూడా విడుదల చేయలేదని కాగ్‌ వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. జలయజ్ఞంలో దోచుకున్న నిధులను రికవరీ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంగా వుందన్నారు. అవినీతికి పాల్పడిన మంత్రులు, అఽధికారుల ఆస్తులను రికవరీ చేస్తామన్నారు. ఇటీ వల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ అధినేత జగన్‌ రౌడీలా ప్రవర్తించారని అయ్యన్న ఆరోపించారు.