Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:27AM

‘పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’




జైనూర్‌: మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా పరిషత్‌ సీఈవో అనితాగ్రేస్‌ అన్నారు. బుధవారం ఆమె జైనూర్‌ ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బానోత్‌ దత్తా రాం, ఎంఈవో శంకరయ్య , జడ్పీటీసీ అసరఖానమ్‌, మండల ఉపాధ్యక్షుడు షేక్‌ రషీద్‌ తదితరులతో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో విద్యార్థుల కోసం తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతామన్నా రు. జడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలో కంప్యూటర్‌ విద్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్‌ బోధకులు లేనందున విద్య సక్రమంగా అందడం లేదని ఉపాద్యాయులను నియమించాలని ఎంఈవో శంకరయ్య కోరారు. ఉర్దు పాఠశాలలో సత్వరమే ఇన్‌స్ట్రక్టర్లను నియమించి ఉర్దు మీడియంలో బోధనను పునఃప్రారంభించాలన్నారు. అనంతరం సీఈవో అనితాగ్రేస్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులను పరామర్శించారు. పీహెచ్‌సీలో ఏడు పోస్టులు ఉండగా ఒకరిద్దరితో వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యాధికారి రాథోడ్‌వాణి వివరించారు. జైనూర్‌లో 30 పడకల ఆస్పత్రి నిర్మించగా, ఈ భవనాన్ని ఇంత వరకు డిపార్టుమెంటుకు అప్పగించలేదన్నారు. జైనూర్‌, సిర్పూర్‌ (యు) మండలాల నుంచి వందలాది మంది రోగులు వస్తున్నారని వారికి అరకొర వసతుల మద్య వైద్యం అందజేస్తున్నామన్నారు. జైనూర్‌ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థినులు ఆస్పత్రి వరండాలో పడుకున్న దృశాన్ని చూసి సీఈవో అనితాగ్రేస్‌ వెంటనే వారికి వైద్యం అందిం చాలన్నారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ సభ్యుడు సుబుర్‌ఖాన్‌, నాయకులు కొడప ప్రకాష్‌, జాదవ్‌ గణపత్‌, డాక్టర్‌ అశిస్‌ పాల్గొన్నారు.