Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:27AM

నెన్నెలలో సోలార్‌ పవర్‌ ప్లాంటు


నెన్నెల: జిల్లా తూర్పు ప్రాంతంలో ఇక సౌర వెలుగులు తనుకులీననున్నాయి. నెన్నెలలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణంపై ఆశలు చిగురించాయి. నెన్నెల మండల కేంద్రంలో సోలార్‌ పవర్‌ ప్లాంటు కోసం ప్రతిపాదించిన భూమిలో బుధవారం చేపట్టిన సర్వే పనులను మంచిర్యాల ఆర్డీఓ అయేషా మస్రత్‌ఖానం పరిశీలించారు. వారం రోజుల్లోగా స ర్వే పనులు పూర్తి చేసి భూముల వివరాలు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న సోలార్‌ వపర్‌ ప్లాంటు పనులపై ఆశలు మొగ్గుతొడిగాయి.
సంప్రదాయేతర విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగినా దృష్య్టా తెలంగాణ ప్రభుత్వం సోలార్‌ పవర్‌పై దృష్టి సారించింది. నెన్నెలలో సోలార్‌ పవర్‌ ప్లాంటు నిర్మాణంతో తూర్పు జిల్లాకు సరిపడ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి కలుగుతున్న అవరోధాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలనే దృఢ నిశ్చయంతో సర్కారుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను స్థానిక సబ్‌ స్టేషన్‌కు అనుసంధానం చేసి గ్రామాలకు సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు. సౌర శక్తి గంటలు అధికంగా ఉండడం, అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో నెన్నెలలో విద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి.
ఫ అటవీ అనుమతుల గ్రహణం...
నెన్నెల శివారులో సోలార్‌ పవర్‌ప్లాంట్లు, ఇండస్ర్టియల్‌ పార్కు నిర్మించాలని 2010లోనే నిర్ణయించారు. లేఖ నెంబరు 01/ఏపీఐఐసీ/ఎల్‌ఎ/నెన్నెల/2010 ద్వారా కరీంనగర్‌ జోనల్‌ కార్యాలయం నుంచి భూసేకరణ చేపట్టాలని అప్పటి కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. నెన్నెల, బొప్పారం శివార్లలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు నిర్మాణానికి 1008 ఎకరాల భూమిని గుర్తించారు. సర్వే నంబరు 671లో 452.37 ఎకరాలు , సర్వే నంబరు 672లో 550.15 ఎ కరాలు భూమిని సేకరించారు. 671 ,672 సర్వే నం బర్లలో 790.29 ఎకరాల భూములను రెవెన్యూ శాఖ నిరుపేదలకు పంపిణీ చేసి పట్టాలు అందజేసింది. అప్పట్లో సర్వే చేపట్టి గుర్తించిన భూముల్లో తమ భూములున్నాయంటూ అటవీ శాఖ మోకాలడ్డు వేసింది. దీంతో పవర్‌ ప్లాంటు నిర్మాణం పనులకు విఘాతం కలిగింది. అటవీ శాఖాధికారులు అభ్యంత రం చెప్పడంతో ప్లాంటు నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండడంతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.