Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:27AM

జిల్లాలో 400 ‘హరితహారం’ నర్సరీలుకాగజ్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరిత హారం పథకం కింద ఆదిలాబాద్‌ జిల్లాలో 400 నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అటవీ సంరక్షణాధికారి తిమ్మారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక డీఎఫ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్కో నర్సరీలో లక్ష మొక్కల చొప్పున జిల్లాలో మొత్తం నాలుగు కోట్ల మొక్కలను వచ్చే మూడేళ్లలో ఆటాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జిల్లాలో సోషల్‌ ఫారెస్టు ద్వారా 130, అటవీ శాఖ ద్వారా 60, మిగిలిన శాఖల ద్వారా 210 నర్సరీలను ఏర్పాటుకు రూ.3.61 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి మండల పరిధిలో 8 నుంచి 12 నర్సరీలను ఏర్పాటు చేయనున్నామని, ప్రతి మూడు గ్రామాలకు ఒక నర్సరీ ఉండేలా లక్ష్యంతో వీటిని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌ డీఎఫ్‌ఓ శివప్రసాద్‌ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో మూడు పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నా రెండు పులలను మాత్రమే గుర్తించినట్లు తెలిపారు. ఇందులో ఒక పులికి చైత్ర అని పేరు పెట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. కాగజ్‌నగర్‌ నుంచి సిర్పూర్‌కు వెళ్లె రోడ్డు మార్గంలో వన్యప్రాణులు తరచుగా రోడ్డు దాటుతూ ఉండడంతో ఈ మార్గంలో 30 కిలో మీటర్లకు మించి వాహనాలు వేగంగా పోరాదని బోర్డులు అమర్చినట్లు తెలిపారు.