Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:27AM

ముంపు ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి



నిర్మల్‌ : జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో వై ద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ సాంబశివరావు అ న్నారు. బుధవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో డివిజన్‌ స్థాయి ఎస్‌పిహెచ్‌వోలు, మె డికల్‌ ఆఫీసర్‌ల సమీక్ష సమావేశంలో మా ట్లాడారు. ముఖ్యంగా జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో వైద్య సేవలు వేగవంతం చేయాలన్నా రు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో వైద్యులు పర్య టిస్తూ వైద్య సేవలను అందించాలన్నారు. గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను అ డిగి తెలుసుకోవాలన్నారు. సరిపడ మందు లు అందుబాటులో ఉన్నాయని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వ్యాధులు తగ్గుముఖం పట్టేల చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి స్ర్తీల ప్రసవ సమయాన్ని గు ర్తించి ముందస్తుగానే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రమాదాలను నివారించాలన్నారు. త్వరలోనే అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో వైద్యు లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌వో రుక్మిణి, డిఐవో చందు, ఏడి ఎంహెచ్‌వో ప్రభాకర్‌రెడ్డి, డిఎం వో ఆలం రవి, ఎస్‌పిహెచ్‌వో మహేంధర్‌, డి విజన్‌ స్థాయి వైద్యులు, మెడికల్‌ ఆఫీసర్‌లు రాజేష్‌ పాండే, అంబకంటి ముత్తన్న ఉన్నారు.
డాక్టర్‌ అప్పాల చక్రధారి కుటుంబానికి పరామర్శ
పట్టణంలోని ప్రముఖ పిల్లల వైద్య నిపు ణులు డాక్టర్‌ అప్పాల చక్రధారి కుటుంబాన్ని బుధవారం డైరెక్టర్‌ సాంబశివరావు పరామర్శించారు. చక్రధారి కూతురి మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్‌పిహెచ్‌వోలు, వైద్యులు, తదితరులున్నారు.