Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:26AM

సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం


గర్మిళ్ల : సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అని జిల్లా కలెక్టర్‌ జగన్మోహన్‌ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఆర్‌ బీహెచ్‌వీ హైస్కూల్‌లో బుధవారం ఏర్పాటు చే సిన డివిజన్‌ స్థాయి ప్రభుత్వ పాఠశాలల ప్ర ధానోపాధ్యాయుల సమావేశానికి కలెక్టర్‌ ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ప్రధానోపాధ్యాయులను ఉద్దేశించి కలెక్టర్‌ మా ట్లాడుతూ, నాణ్యతతో కూడిన విద్యను అం దించడం ద్వారా విద్యార్థులను నూటికి నూరు శాతం పాసయ్యాలే తీర్చిదిద్దాలని సూచించా రు. ప్రయత్నలోపంతో కొంత మేర జిల్లాలో పదవ తరగతి ఫలితాల శాతం తగ్గిందని, దీ న్ని సవరించుకోవాల్సిన బాధ్యత ఉపా ధ్యాయులపై ఉందన్నారు. పరీక్షల్లో ఎలాంటి అ వకతవకలకు తావు లేకుండా నూటికి నూరు శాతం నాణ్యతమైన ఫలితాలను సాధించాలని సూచించారు. పరీక్షల్లో కాపీ అనే ఆలోచనే వి ద్యార్థులకు రాకుండా చూడాలని కోరారు. మా రిన సిలబస్‌తో పాటు పరీక్షల్లో సవరణలను ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అంద జేయ డం ద్వారా సానుకూల స్పందన పొందాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు టీం లీడర్‌గా వ్యవహరిస్తూ ఉపాధ్యాయున్ని విద్య లో కార్యోన్ముఖుల్ని చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొ న్న సమస్యలను అధిగమించి లక్ష్యాన్ని సాధించడానికి ఉపాధ్యాయులకు తమవంతు మద్దతును అందజేస్తామని స్పష్టం చేశారు. 9, 10 వ తరగతి విద్యార్థుల మౌళిక వసతుల కోసం ఎంత ఖర్చయినా భరించేందుకు నిధులు పు ష్కలంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు పాఠశాల ల్లో ఉన్న వాతావరణం దృష్ట్యా ఎక్కువ ఫలితాల సాధనకు కారణమవుతుందని పేర్కొన్నా రు. జిల్లావ్యాప్తంగా ఉన్న డ్రాపౌట్లలో బాలికల శాతం ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లాలో 11 శాతం మాత్రమే పదవ తరగతి విద్యార్థు లు ఏడవ తరగతి పుస్తకాలను పరిపూర్ణంగా చదవడం బాధాకరమన్నారు. తాను కేవలం ఉపాధ్యాయులను ప్రోత్సహించడానికే సమావేశానికి హాజరయ్యానని, మున్ముందు సమీక్షా సమావేశాల్లో మాటలకు అవకాశం ఇవ్వనని స్పష్టం చేశారు. ఇంకా సంతృప్తికరమైన సమ యం ముందున్నందు వల్ల పదవ తరగతి ప రీక్షలో నాణ్యమైన ఫలితాలు సాధించాల్సిందేన ని ఆయన స్పష్టం చేశారు. కేవలం రెండు, మూడు బ్యాచ్‌లకు కాపీయింగ్‌ అలవాటును తగ్గిస్తే విద్యార్థుల్లో ఆ ఆలోచన పూర్తిగా రూ పుమాపిన వారవుతారని, ఆదిశగా కృషి చేయాలని కోరారు.
సిబ్బంది కొరత ఉన్న చోట ఔట్‌సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలి...
అనంతరం తమ తమ పాఠశాలల్లో 2013- 14 విద్యాసంవత్సరంలో సాధించిన పదవ తరగతి ఫలితాల వివరాలు, పాఠశాల సమస్యలు, మౌళిక వసతుల పట్ల సూచనలు, సలహాల ను అందజేయాల్సిందిగా ప్రధానోపాధ్యాయుల ను కోరారు.
ఈ సందర్భంగా తీగల్‌పహాడ్‌ ప్ర ధానోపాధ్యాయుడు పర్వతి సత్యనారాయణ మాట్లాడు తూ, తమ పాఠశాలలో నాలుగు సబ్జెక్టులను బోధించేందుకు సిబ్బంది లేరని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే ఉత్తమ స్థాయి ఫలితాలను సాధించేందుకు తాము కృషి చే స్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి స్పం దించిన కలెక్టర్‌ సిబ్బంది కొరత ఉన్న చోట బోధన కోసం ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉపాధ్యాయులను నియమించుకోవాలని, వారికి ప్రతిఫలం కింద నెలకు రూ.7 వేల చొప్పున ఒక్కొ క్కరికి జిల్లాలో సర్వశిక్షా అభియాన్‌ మిగులు నిధుల నుంచి రెమ్యూనరేషన్‌ను చెల్లిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం బె ల్లంపల్లి ప్రధానోపాధ్యాయురాలు శారద సమస్యను వి వరిస్తుండగా వేదిక వెనకాల నిలబడి ఉన్న మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్‌ ఖానం, స్థానిక తహసీల్దార్‌ సురేష్‌లు మాట్లాడుతుండడం గమనించిన కలెక్టర్‌ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత గల ఆర్డీవో ఇలా స మావేశంలో మాట్లాడితే ప్రధానోపాధ్యాయులు అలుసు తీసుకుంటారని తెలియదా... అని కో పగించారు. సమావేశంలో కలెక్టర్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణరెడ్డి, మంచిర్యాల ఉప విద్యాశాఖాధికారి పీఏవీ. నర్సింహాచారి, స్థానిక తహసీల్దార్‌ సురేష్‌, డి విజన్‌లోని మండల విద్యాశాఖాధికారులు, ప్ర ధానోపాధ్యాయులు పాల్గొన్నారు.