Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:26AM

పాలిటెక్నిక్‌, హార్టికల్చర్‌ వైస్‌ప్రిన్సిపాల్‌ దిష్టిబొమ్మ దహనం




కలెక్టరేట్‌: హార్టికల్చర్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగు లు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యం చర్యలను నిరసిస్తూ బుధవారం సీఐటీయూ అనుబంధ పాలిటెక్నిక్‌, హార్టికల్చర్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై వైస్‌ప్రిన్సిపాల్‌ మహేందర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముందుగా అధికారుల తీరును ఎండగడుతూ బస్టాండ్‌ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్‌ మాట్లాడుతూ రెండు నెలలుగా హెచ్‌ఆర్‌ఎస్‌, పాలిటెక్నిక్‌ కార్మికులకు 12నెలలుగా, కాంట్రాక్టు ఉద్యోగులకు 2నెలల జీతాలు హెచ్‌పీటీలో కాంట్రాక్టు ఉద్యోగికి 4నెలలు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇందులో ఈపీఎఫ్‌కు జమ చేయాల్సిన డబ్బుల నుంచి రూ. 10339లు తక్కువ చెల్లిస్తున్నారని ఆరోపించారు. అదే విధంగా గణపతిపేరుతో కటింగ్‌ చేసిన మూడు నెలల ఈపీఎఫ్‌ డబ్బులు చెల్లించక పోవడం దారుణమని మండిపడ్డారు. గత రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వకుండా తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పై సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ గత 12 రోజులుగా నిరవదిక సమ్మె చేపట్టామని తెలిపారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించామని, వెంటనే ఈ సమస్యలను పరిష్కరించక పోతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎ.స్వామి, యూనియన్‌ అధ్యక్షున్‌ హరిన్‌ హుస్సేన్‌, కార్యదర్శి పుష్ప, లలిత, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.