Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:26AM

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని...ఆర్‌ఎం కార్యాలయం ముట్టడి




కలెక్టరేట్‌: ఆదిలాబాద్‌ రీజియన్‌లోని ఆరు డిపోలలో కార్మి కులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ బుఽధవారం ఆర్టీసీ ఎంప్లా యిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. గత నెల 27నుంచి చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈకార్యక్రమానికి ముందుగా కార్మికులు డిపో కార్యాలయం నుంచి ఆర్‌ఎం కార్యాలయం వరకు అధికారుల తీరును ఎండగడుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి ఆర్‌ఎం, డీఎం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని మానుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపప్రధాన కార్యదర్శి వెంకటిగౌడ్‌ మాట్లాడుతూ రీజినల్‌ మేనేజర్‌ నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. కండక్టర్లకు నాణ్యమైన టిమ్స్‌ మిషన్లు అందించాలని, మహిళ కార్మికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. చెకింగ్‌ అధికారులు కండక్టర్లను వేధింపులకు గురిచేస్తూ ఆకారణంగా కేసులు బుక్‌ చేస్తున్నారని, దీని వల్ల తమ జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉట్నూర్‌లో డిపోమేనేజర్‌ను నియమించకుండా అధికారులే బాధ్యతలు చూడడం వల్ల కార్మి కుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఉట్నూర్‌ డిపో బస్సులకు ఆ డిపో లోని డీజిల్‌ టాప్‌ఆప్‌ చేసేలా చర్యలు తీసుకొని, డిపోకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఎం ఏకపక్షంగా వ్యవహరిస్తూ గుర్తింపు యూనియన్‌ పట్ల కోడ్‌ ఆఫ్‌ క్రమశిక్షణ పాటించడం లేదని, పై అధికారుల ఆదేశాలను పక్కనబెట్టి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని మానుకోవాలని, లేని పక్షంలో సమ్మె చేయడానికైనా వెనుకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జీఎస్‌ నారాయణ, జోనల్‌ కార్యానిర్వాహణక అధ్యక్షులుడి.కిషన్‌, వీరయ్య, రీజినల్‌ అధ్యక్షులు కె.ఎం రెడ్డి, రీజినల్‌ కార్యదర్శి జీఎస్‌ నారాయణ, వివిధ డిపోల కార్మికులు,అధ్యక్ష,కార్యదర్శులు చంద్రయ్య, సురేందర్‌, బీంరెడ్డి, రమేశ్‌, శ్రీనివాస్‌, మురళీ, ఏజే ఖాన్‌, జ్యోతి, సుజాత, ప్రకాష్‌ పాల్గొన్నారు.