Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:26AM

తెలంగాణ వీర వనిత ఐలమ్మ
మంచిర్యాల టౌన్‌ : తెలంగాణ సాయూధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 29వ వర్థంతి సందర్బంగా బుధవారం మంచిర్యాల ప ట్టణంలోని బైపాస్‌ రోడ్డులో గల అమరవీరుల స్థూపం వద్ద ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివాళులను అర్పించారు. మం చిర్యాల రజక అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో అ మర వీరుల స్థూపం వద్ద ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలు అర్పించారు. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు మైలారం శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలంగాణ సాయూధ పోరాటంలో తెలంగాణ పోరాటం, రజాకారుల నుంచి విముక్తి కొరకు పోరాడిన యోధురాల న్నారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ది సం స్థ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోచం, జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు పారుపల్లి శ్రీనివాస్‌, నాయకులు నిమ్మరాజుల కుమార్‌, రాజం, మడిక శ్రీనివాస్‌, శంకర్‌ , పోశం, మల్లేష్‌, ధర్మాయి, బాపు, సత్యనారాయణ, భూమయ్య, రాజయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.
జైపూర్‌ : నిజాం పాలకులను ఎదిరించి పో రాడిన చాకలి ఐలమ్మ వీర వనితగా శ్రీరాం పూర్‌ సీఐ వెంకటేశ్వరబాబు పేర్కొన్నారు. చాక లి ఐలమ్మ 29వ వర్థంతి సంధర్భంగా రజక కు ల సంఘం సభ్యులు మండల కేంద్రంలో ఏ ర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ముఖ్య అథి తిగా హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన జెడ్‌పీటీసీ సభ్యులు జర్పుల రాజకుమార్‌ నా యక్‌, మండల పరిషత్‌ అధ్యక్షురాలు మెండె హేమలత సత్యనారాయణ యాదవ్‌లు ఆనా డు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ముందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిం చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ బీ మిని రాజయ్య, ఎంపీటీసీ సభ్యులు మంతెన లక్ష్మన్‌, మండల అభివృద్ధి అధికారి నాగేశ్వర్‌ రెడ్డి, ఎస్సై సాధీక్‌పాష, రజక కుల సంఘం జి ల్లా అధ్యక్షులు గుడికందుల లక్ష్మినర్సయ్య, నా గేందర్‌, వివిధ పార్టీలకు చెందిన నాయకులు సత్యనారాయణ యాదవ్‌, సత్యనారాయణ, బ లమూరి అరవిందరావు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ బుధవారం జరిగింది. చాకలి ఐలమ్మ వర్థంతిని పురస్కరించుకుని లక్షెట్టిపేట రజక మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆ విష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ కట్ల చంద్రయ్య, జడ్పీటీసీ చుం చు చిన్నయ్య, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు కడ్తల మల్లయ్య, జిల్లా అధ్యక్షుడు చిక్కాల ద త్తులు హాజరయ్యారు.