Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:25AM

స్థాయి పెరగదు..వైద్యం అందదు- ఇబ్బంది కలిగిస్తున్న సిబ్బంది కొరత..
ప్రభుత్వాసుపత్రిలో ప్రస్తుతం వంద పడకల స్థాయిలో నిర్వహించే సిబ్బందిలో కొని ఖాళీలు ఉండటంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరు సివిల్‌ సర్జన్లు , ఒక ఆర్‌ఎంఓ, మరో జనరల్‌ సర్జన్‌ అవసరం ఉంటుంది. ఇప్పటికే ఉన్న వైద్యుల్లో గైనకాలజిస్టు ధీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ప్రస్తుతం మహిళలకు చిక్సితలు అందించడానికి ప్రసవాలు, ఆపరేషన్ల కోసం ప్రైవేటు వైద్యులను పిలిపిస్తున్నారు. ఆసుపత్రిలో ప్రతిరోజు 10 వరకు ప్రసవాలు జరుగుతుంటాయి. మహిళా వైద్యురాలు అందుబాటులో లేకపోవడంతో మహిళలు వారి సమస్యలు తెలపడంలో ఇబ్బందులు పడుతున్నారు. వార్డు బాయ్స్‌, వాచ్‌మెన్‌, సెక్యూరిటీ, సిబ్బంది కొరత తీవ్రంగా పీడిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులను, ప్రైవేటు వాహనాలపై వచ్చేవారిని సిబ్బంది సె్ట్రచర్‌, వీల్‌ చైర్లపై ఓపి రూంలోకి, ఎమర్జెన్సీ రూంకు తరలించాల్సి ఉంటుంది. కాని సిబ్బంది కొరత కారణంగా రోగుల బంధువులే వాటి మీద తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ పని చేయని ఇంక్యుబెటర్లు..
ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులకు ఏదైన సమస్య ఎదురైతే వెంటనే వారిని ఇంక్యబెటర్‌లో పెట్టి వైద్యసేవలను అందిస్తారు. ఆసుపత్రిలో ఆరు ఇంక్యబెటర్స్‌ ఉన్నప్పటికీ ఇందులో కొన్ని పనిచేయడం లేదు. దీంతో పిల్లలను ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించాలని వైద్యులు రిఫర్‌ చేస్తున్నారు.
ఫ ఆసుపత్రిలో నీటిసమస్య...
ప్రభుత్వ ఏరియాసుపత్రిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉన్న శుద్ధ జల యంత్రం పనిచేయడంలేదు. మరమతులు లేక మూలనపడి ఉంది. దీంతో నీటి సమస్య తీవ్రంగా మారిపోయింది. ఆసుపత్రుల్లో రోగుల బంధువులు బయటికి వెళ్లి నీటిని కొనుక్కుని తాగాల్పిన దుస్థితి ఏర్పడింది. ఒక బోరు ఉన్నప్పటికీ సిబ్బంది సరిగా మోటర్‌ నడిపించకపోవడంతో ట్యాంకులు నిండటంలేదు. నీళ్ల కోసం ప్రజలు తల్లడిల్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరుగుదొడ్లకు వినియోగించే నీరు కూడా అరకొరగానే వస్తుంది. దీని వల్ల మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. పారిశుధ్య సిబ్బంది సరిగా శుభ్రం చేయకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి.అపరిశుభ్రంగా మారాయి.
ఫ పడకల కొరత
పడకల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వంద పడకల ఆసుపత్రి అయినందున అంతకంటే ఎక్కువ రోగులు ఇన్‌పేషెంట్లుగా ఉండటంతో ఒకొక్కసారి ఒక మంచంపై ఇద్దరు రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంచాలను సకాలంలో మరమత్తులు చేయకపోవడం చాలా వరకు తుప్పుపట్టాయి.
రోడ్డు ప్రమాదాలు ఈ ప్రాంతంలో ఎక్కువగానే జరుగుతుంటాయి. చాలా వరకు తలకు, కాళ్లు, చేతులు విరగడం లాంటివి గాయాలు అవుతాయి. ఇలాంటి వారిని ఆసుపత్రిలో పరిక్షించి ఉన్నత వైద్యం పేరిట ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. సకాలంలో వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ పరిస్థితి విషమించిందని చెబుతూ హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తీసుకువెళ్లాలని సూచిస్తూ ఉంటారు. ఆర్థికంగా లేని పేదలు ధర్మాసుపత్రినే నమ్ముకొని ఇక్కడకు వస్తారు. కాని వారి ఆశలు నిరాశలుగానే మిగిలిపోతాయి. గాయాలయిన వారిని కాపాడుకోవాలనే తాపత్రయంతో అప్పులు చేసి ఉన్నత వైద్యం కోసం ఇతర ప్రాంతాల్లో ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తుంటారు.
ఫ మూలకుపడ్డ అంబులెన్స్‌ కరువు..
ఆసుపత్రిలో ఉన్న అంబులెన్స్‌ మూలన పడింది. ఆరు నెలల క్రితం ప్రైవేటు అంబులెన్స్‌ ద్వారా రోగులను తరలించేవారు. కాని ఈ అంబులెన్స్‌ ద్వారా రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే ఉద్దేశ్యంతో ఆ కాంట్రాక్టును ఎత్తివేశారు. నాలుగు నెలల నుంచి ఆసుపత్రిలో అంబులెన్స్‌ లేకుండా పోయింది.
ఫ కరెంట్‌ పోతె అంఽధకారమే...
ఈ మధ్య కాలంలో విద్యుత్‌ కోతలు చాలా వరకు పెరిగిపోయాయి. ఆసుపత్రికి జనరేటర్‌ సౌకర్యం ఉన్నప్పటికి దానిని వినియోగించడంలేదు. డీజిల్‌ ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతో విద్యుత్‌ లేకున్నా చీకట్లోనే రోగులు కాలం వెళ్లదీస్తున్నారు. ఆపరేషన్‌ల సమయంలో కరెంటు పోతె జనరేటర్‌ను ఆన్‌ చేస్తున్నారు తప్ప రాత్రి వేళ్లలో, పగటివేళ్లల్లో కరెంట్‌ పోతె జనరేటర్‌ను వినియోగించడంలేదు.
ఫ చేతులు తడిపితేనే పనులు...
ఆసుపత్రిలో కాన్పుకోసం వచ్చిన మహిళల నుంచి, ఎక్స్‌రే, స్కానింగ్‌, ఈసీజీ పరీక్షల కోసం వచ్చే రోగుల నుంచి కొందరు మామూళ్లను ఆశిస్తున్నారు. కాన్పుకోసం వచ్చిన మహిళల నుంచి రూ. 2500 వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.