Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:18AM

ఏబీఎన్‌ ప్రసారాలను పునరుద్ధరించాలి


గుంటూరు (నల్లచెరువు) : కక్షసాధింపు ధోరణి మాని ఏబీఎన్‌, టీవీ 9 ప్రసారాలను పునరుద్ధరించాలని, జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు ఏిపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. శంకర్‌విలాస్‌ సెంటర్‌లోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నుంచి గుంటూరు రూరల్‌ మండల తహశీల్దార్‌ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనం తరం డిప్యూటి తహశీల్దార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించి గవర్నర్‌కు పంపాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఏిపీ యూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు భక్తవత్సలం మాట్లాడుతూ తెలంగాణా సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కక్షసాధింపు ధోరణితో నిలిపివేసిన ఏబీఎన్‌, టీవీ 9 ప్రసారాలు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ రామచంద్రరావు, ఎడిషన్‌ ఇన్‌ఛార్జి సాం బశివరావు, బ్యూరో ఇన్‌చార్జి భాస్కరరావు, స్టా్‌ఫ్‌ రిపోర్టర్‌ మధుసూదనరావు, రిపోర్టర్లు రాజు, ఎం మధు, రవి బా బు, నాగరాజు, కోటేశ్వరావు, కిరణ్‌ బాబు, ఏపీయూడబ్ల్యుజే నగర అధ్యక్షులు రామారావు, కార్యదర్శి రమేష్‌, మాజీ కార్యదర్శి కేవీ భాస్కరరెడ్డి, గిరి, అశోక్‌, మురళి, మధుసూధనరావు, శివ, రవీం ద్ర, సురేష్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.