Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:18AM

ఉపాధి కల్పన కార్యాలయం ముట్టడి



గుంటూరు (నల్లచెరువు) : ఉపాధి కల్పించాలని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతూ ఏఐవైఎఫ్‌ (అఖిల భారత యువజన సమాఖ్య) ఆధ్వర్యంలో నిరుద్యోగులు బుధ వారం ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భం గా ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్య క్షులు ఎ అయ్యప్ప స్వామి మాట్లాడుతూ ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. లేకుంటే నెలకు రూ. 3 వేల వంతున నిరుద్యోగ భృతి చెల్లించాలన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉపాధి కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకుని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. ఈ పోస్టులపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేసి వాటిని భర్తీ చేయాలన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలను నెరవేర్చాలన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు. బీఈడీ విద్యార్థులకు, ఎస్జీటీలకు ఇందులో అవకాశం కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్ర, రామకృష్ణ మల్లయ్య లింగం భవనం నుండి ర్యాలీగా వచ్చిన సమాఖ్య నాయకులు, నిరుద్యోగులు కొంత సేపు ఉపాధి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.