Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 02:17AM

రాజధాని భూసేకరణపై దృష్టి పెట్టాలి





ఆంధ్రజ్యోతి - గుంటూరు : రాజధానికి అవసరమైన భూ సేకరణపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే ఆదేశించారు. క్యాంప్‌ ఆఫీస్‌లో బుధవారం రాత్రి ఆయన అధికారులతో సమీక్షించారు. గుంటూరు - విజయవాడ మధ్య రాజధాని ఉంటుందని సీయం చంద్రబాబు ఆదేశించడంతో ఆ దిశగా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు రాజధాని అంశంపై బిజిగా ఉన్నామని చెబుతున్నారు. హైదరాబాద్‌లో సీయం చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలోని ముఖ్యాంశాలను కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, జెసి వివేక్‌ యాదవ్‌, ఆర్డీవోలకు వివరించారు. కృష్ణానది తీర ప్రాంతంలోని గుంటూరు డివిజన్‌లో ఉన్న బెల్లంకొండ, అచ్చంపేట, అమరావతి, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు... వీటితో పాటు పెదకాకాని, తాడికొండ, గుంటూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ భూములపైనే దృష్టి పెట్టారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భూములను రాజధాని కోసం ఉపయోగించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇతర పథకాలపై...
రాజధానితో పాటు పల్నాడులో సోలార్‌ సిటి, గుంటూరు - తెనాలి రోడ్డులో స్మార్ట్‌ సిటీ (హైటెక్‌), యడ్లపాడు మండలంలో టెక్స్‌టైల్‌ పార్కు, తాడికొండ మండలం లాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, పెదకూరపాడు మండలం గారపాడులో ఒంగోలు జాతి కోడెదూడలు, పెయ్యలు, ఆవులు, అంబోతుల కేంద్రం, తాడేపల్లి మండలంలో నేషనల్‌ ఇనిస్టుట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడి ) సంస్థ, అమరావతి, కొండవీడు, నాగార్జున కొండలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం, నాగార్జున సాగర్‌లో టూరిజం విమానాశ్రయం ఏర్పాటు, కొండవీడు నుంచి ఫిరంగిపురం వైపు రహదారులు, మంగళగిరి మండలంలో ఎయిమ్స్‌, ప్రకృతి వైపరిత్యాల నష్ట నివారణ సంస్థ, నల్లపాడులో వికలాంగులకు కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం, గుంటూరు - పిడుగురాళ్ల వయా సత్తెనపల్లి, రాజుపాలెం, గుంటూరు - ఒంగోలు వయా ప్రత్తిపాడు, పెదనందిపాడు, పర్చూరు, ఇంకొల్లు, గుంటూరు - తెనాలి వయా సంగంజాగర్లమూడి, గుంటూరు - బాపట్ల వయా పొన్నూరు రోడ్లను నాలుగు లైన్లుగా విస్తరించడానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కాంతి లాల్‌ దండే ఆదేశించారు. జెసి వివేక్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన్రపాజెక్టులకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికపై నిర్వహించాలన్నారు. ఆర్డీవోలు భాస్కర్‌ నాయుడు, నరసింహులు, మురళీ, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఇప్పటికే వివిధ పథకాలపై నివేదికలు ఇఇ్చనట్లు చెప్పారు.